Nani's HIT 3 OTT Platform Locked: నేచురల్ స్టార్ నాని (Nani), శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబోలో అవెయిటెడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 3' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పాటు.. మూవీ లవర్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై చర్చ మొదలైంది.

Continues below advertisement


ఆ ఓటీటీలో స్ట్రీమింగ్


ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందే భారీ ధరకు రూ.54 కోట్లకు డీల్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. 


అప్పటి నుంచే స్ట్రీమింగ్?


సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్‌లో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే డిజిటల్ స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. నెట్ ఫ్లిక్స్.. 'హిట్ 3' డిజిటల్ స్ట్రీమింగ్ సహా 5 వారాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూన్ సెకండ్ వీక్‌లో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. 


Also Read: 'రెట్రో' ట్విట్టర్ రివ్యూ - సూర్య ఖాతాలో మరో హిట్ పడిందా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?


'హిట్' ఫ్రాంచైజీలో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో 'హిట్ 3: ది థర్డ్ కేస్' తెరకెక్కించారు. సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించగా.. రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. 


మూవీపై నెటిజన్లు ఏమంటున్నారంటే?


ఇప్పటికే ప్రీమియర్ షోస్, నార్మల్ షోస్ చూసిన ఆడియన్స్.. సోషల్ మీడియా వేదికగా మూవీ రివ్యూ రాస్తున్నారు. నేచురల్ స్టార్ కెరీర్‌లోనే ఇది మోస్ట్ వయలెంట్ సినిమా అని.. ఇప్పటివరకూ ఎవరూ చూడని డిఫరెంట్ లుక్‌లో మాస్ యాక్షన్‌తో నాని అదరగొట్టారని అన్నారు. సినిమాలో వయలెన్స్ ఎక్కువగా ఉందని.. పిల్లలను సినిమాకు దూరంగా ఉంచాలని కామెంట్స్ చేస్తున్నారు.


పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నాని అదరగొట్టారని.. స్క్రీన్ మీద కొన్ని మూమెంట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయని అంటున్నారు. ఇదే సమయంలో కొన్ని రొటీన్ సీన్స్.. ఫస్టాఫ్‌ను మించి సెకండాఫ్ చాలా బాగుందని తెలిపారు. క్లైమాక్స్ సినిమాకే హైలెట్ అని కామెంట్స్ చేస్తున్నారు.