Hero Sumanth's Aham Reboot Movie Direct Ott Release Streaming Date: సుమంత్ హీరోగా తెర‌కెక్కిన సినిమా 'అహం రీబూట్'. ఎట్ట‌కేల‌కు రిలీజ్ అవుతుంది. అయితే, థియేట‌ర్ల‌లో కాదు.. డైరెక్ట్ గా ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది ఈ సినిమా. షూటింగ్ మొద‌లైన దాదాపు రెండేళ్ల తర్వాత సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి తెర‌కెక్కించాడు. మ‌రి ఈ సినిమా విశేషాలేంటి? ఏ ఓటీటీలోకి వ‌స్తుంది? ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. 


స్ట్రీమింగ్ ఎక్క‌డ‌, ఎప్పుడంటే?


సుమంత్ న‌టించిన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ 'అహం రీబూట్' ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జులై 30న ప్రేక్ష‌కులకు అందుబాటులోకి రానుంది ఈ సినిమా. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ట్రైల‌ర్ రిలీజ్ చేసింది ఆహా. ఆ ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. 


ఆర్జేగా సుమంత్.. 


హీరో సుమంత్.. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ్ స్టోరీలు చేశాడు. అయితే, ఇప్పుడు 'అహం రీబూట్'‌లో స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో సుమంత్ ఆర్జేగా క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీని రేడియో థీమ్‌తో తీశారు. ఇక ట్రైల‌ర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.   


ఆర్జే సుమంత్ కి ఒక అమ్మాయి నుంచి ఫోన్ వ‌స్తుంది. ఆ అమ్మాయి చాలా భ‌య‌ప‌డుతూ.. "ప్లీజ్ కాపాడండి.. నేను కిడ్నాప్ అయ్యాను అనుకుంటా" అంటూ ఇంగ్లీష్ లో చెప్తుంది. "న‌న్ను కాపాడండి. ఫోన్ క‌ట్ చేయొద్దు. ప్లీజ్.. ప్లీజ్.. చీక‌టి రూమ్ లో ఉన్నాను నాకు భ‌యం వేస్తుంది" అంటుంది. అప్పుడు సుమంత్ ఆమెకు ధైర్యం చెప్తాడు. "ఏమీ కాదు ఎలాగైనా కాపాడ‌తాను" అంటాడు. "ఫోన్ స్విచాఫ్ అయిపోతే ప‌రిస్థితి ఏంటి" అంటూ భ‌య‌ప‌డుతూ చెప్తున్న‌ట్లు ట్రైల‌ర్ లో ఉంది. దీంతో ఆ అమ్మాయిని హీరో కాపాడ‌తాడా? లేదా? అస‌లు అమ్మాయి ఎవ‌రు? కిడ్నాప్ ఎందుకు చేశారు? త‌నేనా ఇంకా ఎవ‌రైనా ఉన్నారా? అస‌లు ఆమె రేడియోకి ఎందుకు ఫోన్ చేసింది? అని ఇంట్రెస్ట్ క‌లిగించారు ట్రైల‌ర్ తో. దీంతో ఇవ‌న్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


మొద‌లైన మూడేళ్ల త‌ర్వాత‌.. 


‘అహం రీబూట్’ సినిమా 2021లో మొద‌లైంది. కాగా.. 2022 లో దీని ఫ‌స్ట్ పోస్ట‌ర్ రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు జ‌నాల్లో. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని సినిమా మొద‌లైన దాదాపు మూడేళ్ల‌కు రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఓటీటీలో. ఇక ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మించారు. ప్రశాంత్ సాగర్అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి శ్రీరామ్ మద్దూరి సంగీత దర్శకుడు. వరుణ్ అంకర్ల సినిమాటోగ్రఫీ అందించారు. చూడాలి మ‌రి సుమంత్ ఆర్జేగా ఎంత‌లా మెప్పిస్తాడు అని.  


Also Read: కాకుడా... ఓటీటీలోకి పిల్ల దెయ్యంతో వందకోట్లు కొట్టిన దర్శకుడి కొత్త సినిమా