క్వీన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) రూపొందించిన వయలెంట్ యాక్షన్ సినిమా 'ఘాటీ'. జూలై రెండో వారంలో థియేటర్లలోకి వస్తుంది. 'వేదం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది.‌ దీనిపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. 

Continues below advertisement


ప్రైమ్ వీడియో ఓటీటీలో ఘాటీ...
ఫాన్సీ రేట్ ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్!
'ఘాటీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకున్నట్లు తెలిసింది.‌ అందుకోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. 


తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో 'ఘాటీ' విడుదల కానుంది. 'బాహుబలి'తో అనుష్కకు పాన్ ఇండియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అటు క్రిష్ కూడా హిందీలో సినిమాలు తీసి ఉన్నారు. ఇందులో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఒక కీలక పాత్ర చేశారు. అందువల్ల సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మంచి రేటు పలికాయి. సుమారు 36 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి amazon ఈ రైట్స్ తీసుకుందట.


Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా సిరీస్ సీజన్ 2 వచ్చేసింది... ఇది ఎలా ఉందంటే?






జూలై 11న థియేటర్లలోకి 'ఘాటీ'
'ఘాటీ'ని మొదట ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు అయితే కుదరలేదు. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక జూలైలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూలై 11న సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.‌ 


ఇప్పటి వరకు అనుష్క నటించిన క్యారెక్టర్లతో కంపేర్ చేస్తే 'ఘాటీ'లో చేసిన క్యారెక్టర్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుందట. గతంలో ఆవిడ ఎప్పుడు ఈ తరహా రోల్ చేయలేదని, ఆ మాటకు వస్తే తెలుగు సినిమా హీరోయిన్లలో ఇటువంటి రోల్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 


Also Read'డీడీ నెక్స్ట్ లెవెల్' రివ్యూ: Zee5 ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ కామెడీ... రివ్యూ రైటర్లను టార్గెట్ చేసే దెయ్యం... సంతానం సినిమా ఎలా ఉందంటే?



క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్ర మాటలు రాయగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. అనుష్క నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అయ్యింది. దానికి తోడు ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. అందుకని, సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.