Kerala Crime Files Web Series Season 2 OTT Release Date: థ్రిల్లింగ్, హారర్, క్రైమ్ మూవీస్, సిరీస్ అంటేనే మంచి క్రేజ్. తాజాగా మరో థ్రిల్లింగ్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. 2023లో విడుదలై మంచి థ్రిల్ పంచిన 'కేరళ క్రైమ్ ఫైల్స్' కొత్త సీజన్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఓ ట్రైలర్ రిలీజ్ చేయగా హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా.. మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' పేరుతో సీజన్ 2ను రూపొందించారు మేకర్స్. ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని టీం వెల్లడించింది. ఈ సిరీస్‌కు అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించగా.. అజు వర్గీస్, జిన్జ్ షాన్, లాల్, శ్రీజిత్ మహాదేవన్, నివాస్ వాలిక్కున్ను కీలక పాత్రలు పోషించారు.

కొత్త ట్రైలర్.. హైప్..

తాజాగా రిలీజ్ అయిన కొత్త ట్రైలర్ సిరీస్‌పై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. 'టీం మొత్తం కొత్తది కాబట్టి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అయినా ఇది ఒక పెట్టె తెరవడం లాంటిది. లోపల ఉన్నది బంగారమో, భూతమో తెరిచే వరకూ తెలియదు.' అంటూ ట్రైలర్ ప్రారంభం కాగా.. ఆసక్తి కలిగిస్తోంది. ఓ పోలీస్ ఆఫీసర్ కోసం పోలీసులే వెతకుతున్నారని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు?, జరిగిన క్రైమ్ ఏంటి? అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.

ఫస్ట్ ట్రైలర్‌లో తిరువనంతపురం జిల్లాలో ఐదుగురు SHOలు, వేర్వేరు స్టేషన్లలో 12 మంది సివిల్ పోలీసులు ఒకే రోజు సస్పెన్స్‌కు గురైనట్లు చూపించారు. అందులో ఓ మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులకు ఎదురైన సవాళ్లను చూపించగా.. కొత్త ట్రైలర్‌లో ఓ పోలీస్ ఆఫీసర్‌నే పోలీసులు వెతకడం హైప్ క్రియేట్ చేస్తోంది.

Also Read: బ్రేకింగ్ న్యూస్: టాలీవుడ్‌లో మరో మృతి... ప్రముఖ టీవీ - సినీ నటులు అల్లం గోపాలరావు ఇకలేరు

ఫస్ట్ సీజన్ స్టోరీ ఏంటంటే?

ఓ లాడ్జీలో మహిళ హత్య జరగ్గా పోలీసులకు సవాల్‌గా మారుతుంది. లాడ్జీలో వాటర్ ప్రాబ్లమ్ తలెత్తగా ఏదైనా రూంలో లీకేజీ ఉందేమోనని రిసెప్షనిస్ట్ వెతకగా.. ఓ రూంలో మహిళ డెడ్ బాడీ కనిపిస్తుంది. షాకై తేరుకుని పోలీసులకు సమాచారం అందిస్తాడు. వారు మహిళ మృతదేహం పరిశీలించి కేసు విచారణ ప్రారంభిస్తారు. ఆమె ఓ వేశ్య అని తెలుసుకుని.. సింగిల్ క్లూతో మర్డర్ మిస్టరీని ఛేదిస్తారు. ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు సెకండ్ సీజన్ దాన్ని మించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.