EVOL Movie Streaming in Aha ఒక సినిమా సెన్సార్ క‌ట్‌ల‌కు గురికావ‌డం మామూలే. కొన్ని సినిమాలు దారుణంగా సెన్సార్ క‌ట్‌ల‌కు గురైందని కూడా చూసుంటాం.. కానీ సెన్సార్ బోర్డు ఏకంగా ఒక సినిమాను బ్యాన్ చేసింది. మ‌రీ ఎంత దారుణంగా ఉండుంటే బ్యాన్‌కి గురైంద‌ని సినీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. సెన్సార్ బ్యాన్‌కు గురైన ఈ చిత్రాన్ని ఓటీటీ (OTT)  ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయాల‌ని సినీ నిర్మాత‌లు నిర్ణ‌యించారు. కానీ సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి A స‌ర్టిఫికెట్ ఇచ్చింది.  


ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్‌


ఇంత‌కీ అది ఏ సినిమా అని ఆలోచిస్తున్నారా.. "EVOL".. అర్థం కాలేదు క‌దా.. "LOVE" ప‌దంలోని అక్ష‌రాల‌ను వెనుక నుంచి రాసి చ‌ద‌వండి సినిమా టైటిల్ వ‌స్తుంది... సినిమా పేరు ఎంత విచిత్రంగా ఉందో.. సినిమా కంటెంట్ కూడా అంతే బోల్డ్‌గా ఉండ‌టంతో సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింద‌నే టాక్ వినిపిస్తుంది. ఇదే ఇప్పుడు ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది.


ఏముందో అన్న ఆసక్తి


అస‌లింత‌కీ అంత బోల్డ్ కంటెంట్ ఏముందో చూద్దామ‌ని యూత్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న "EVOL" చిత్రం ఆగ‌స్టు 15న స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ పాం "ఆహా"(AHA) లో రిలీజ్ అయింది. ఇందుకు సంబంధించి సినిమా ప్రీమియర్ ఆగస్టు 15న అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆహా. 



ఇద్ద‌రు హీరోలు, ఒక హీరోయిన్‌... 


ఈ సినిమాలో అంద‌రూ కొత్తవారిని తీసుకున్నారు. రెండు జంటల మధ్య జరిగే కథను బోల్డ్‌గా తెరకెక్కించారు ద‌ర్శ‌కుడు. "LOVE" అనే టైటిల్‌ను తిరగేశారు. అంటే లవ్ తిరగబడి లస్ట్‌గా మారితే ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమోన‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. మరి సెన్సార్ బోర్డు బ్యాన్ చేసే స్థాయిలో ఈ మూవీలో ఏమంత బోల్డ్ కంటెంట్ ఉందో చూడాలి మరి. ఈ సినిమాలో సూర్యశ్రీనివాస్, శివబొడ్డు రాజు హీరోలుగా నటించగా.. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‍గా న‌టించారు. ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి అమ్మాయి రిలేషన్‍లో ఉండడం, డ్రగ్స్, క్రైమ్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శక నిర్మాత యోగి వెలగపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 


Also Read: తంగలాన్ రివ్యూ: విక్రమ్ ప్రాణం పెట్టేశాడు... అతని కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా?


తొలిసారి బోల్డ్ కంటెంట్‌తో వస్తున్న ఆహా
ఆహా కూడా బోల్డ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆహాలో సంప్రదాయబద్ధమైన సినిమాలు, సిరీస్‌లే రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని వయొలెంట్ థ్రిల్లర్స్, రొమాంటిక్ సినిమాల‌ను కూడా రిలీజ్ చేశారు. కానీ, ఫుల్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్‌లు మాత్రం ఆహాలో ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ కాలేదు. తొలిసారిగా ఒక పూర్తి స్థాయి బోల్డ్ మూవీ (Evol) రిలీజ్ కాబోతోంది. 


Also Read: డబుల్ ఇస్మార్ట్ రివ్యూ: రామ్, పూరి మాస్ సైన్స్ ఫిక్షన్ సీక్వెల్ ఎలా ఉంది? - రిజల్ట్ ‘డబుల్’ అయిందా?