Mr Bachchan Movie OTT Partner and Stream Details: మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja), డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకక్కిన లేటెస్ట్‌ మూవీ 'మిస్టర్‌ బచ్చన్‌'. ఈ మూవీ ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక రవితేజ, హీరోయిన్‌ భాగ్యశ్రీ భోర్సే రొమాంటిక్‌ సాంగ్‌ సినిమాపై ఓ రేంజ్‌లో  బజ్‌ క్రియేట్‌ చేసింది. దీంతో మిస్టర్‌ బచ్చన్‌లో ఫ్యాన్స్‌, ఆడియన్స్‌లో ఫుల్‌ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అలా ఎన్నో అంచనాల మధ్య ఇవాళ (ఆగస్టు 15) ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.


రిలీజ్‌కు ముందు ట్రైలర్‌లో చూపించిన ఎలివేషన్స్‌, డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ మార్క్‌ సినిమాలో కనిపించలేదు అంటున్నారు. ఫస్టాఫ్‌ అదిరిపోయింది.. కానీ సెకండాఫ్‌లో కథను నడిపించడంలో రైటర్‌ తడబడ్డారని, మొత్తానికి మాస్‌ మహారాజా రేంజ్‌లో ఈ లేదంటున్నారు. కానీ ఓ వర్గం ఆడియన్స్‌ని మాత్రం ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. రిలీజ్‌కు ముందు ఆడియన్స్‌లో అంచనాలు.. సినిమా చూశాక పోయాయంటూ ఓ వర్గం ప్రేక్షకలు చెబుతున్నారు. మొత్తానికి మిస్టర్‌ బచ్చన్‌ ఆడియన్స్‌ని నుంచి మిక్స్‌డ్‌ రివ్యూస్‌ని అందుకుంటుంది. మరి చివరి షో వరకు ఈ చిత్రం ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.






ఓటీటీ పార్ట్‌నర్‌


ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై డిజిటల్‌ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి రానుంది, ఎప్పుడు డిజిటల్‌  ప్రిమియర్‌ వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మిస్టర్‌ బచ్చన్ ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 'మిస్టర్‌ బచ్చన్‌' ప్రీమియర్‌ షోతోనే ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదో రివీల్‌ అయిపోతుంది. 'మిస్టర్‌ బచ్చన్‌' ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేసుకుందట. రిలీజ్‌కు ముందుకు మూవీకి ఉన్న బజ్‌ ప్రకారం భారీ ఢీల్‌కి ఒప్పందం కుదుర్చకుందట నెట్‌ఫ్లిక్స్‌.



భారీ ఢిల్


దీంతో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందనేది క్లారిటీ వచ్చేసింది. కానీ, ఈ మూవీ స్ట్రీమింగ్‌పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సాధారణంగా ఒప్పందం ప్రకారం థియేటర్లో రిలీజైన ఏ సినిమా అయినా రెండు నెలల తర్వతే ఓటీటీలోకి రావాలి. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మూవీ ఫలితాన్ని, ఆడియన్స్‌లో ఆ చిత్రానికి ఉన్న బజ్‌ని బట్టి ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. మేకర్స్‌, ఓటీటీ సంస్థల ఒప్పందం ప్రకారం సినిమాను డిజిటల్ ప్రీమియర్స్‌ తీసుకువస్తున్నారు. ముందు నుంచి ఉన్న ఢీల్‌ ప్రకారం చూస్తే మిస్టర్‌ బచ్చన్‌ డిజిటల్‌ ప్రీమియర్‌కి వచ్చేది మాత్రం సెప్టెంబర్‌ చివరి వారంలో లేదా అక్టోబర్‌ రెండో వారంలోనే అని చెప్పాలి. 



Also Read: మిస్టర్ బచ్చన్ రివ్యూ: రవితేజతో హరీష్ శంకర్ మార్క్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?