ఈటీవీ విన్ ఓటీటీలో తాజాగా 'ఆల్ ఇండియా ర్యాంకర్స్ - ఎయిర్' (All India Rankers ETV Win) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ లభించింది. అయితే... సోషల్ మీడియాలో ఈ సిరీస్ పట్ల ఒక సామాజిక వర్గం నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు? ఏమిటి? కాంట్రవర్సీకి కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
వాళ్ళకు కులాభిమానం ఎక్కువ... కాలేజీల్లో గ్రూపులు కట్టిన కుర్రాళ్ళు!'ఎయిర్' వెబ్ సిరీస్ కథను క్లుప్తంగా చెప్పాలంటే... వేర్వేరు నేపథ్యం నుంచి వచ్చిన ముగ్గురు కుర్రాళ్ళు విజయవాడలోని ఒక హాస్టల్‌లో జాయిన్ అవుతారు. పదో తరగతి వరకు ఇంట్లో తల్లిదండ్రులతో ఉన్న పిల్లలు హాస్టల్ జాయిన్ అయ్యాక ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేది చూపించారు.
హాస్టల్ సీన్స్ వినోదాత్మకంగా రాసుకున్నారు. అయితే... ఓ సామాజిక వర్గానికి చెందిన పిల్లలకు కులాభిమానం ఉన్నట్టు, కాలేజీలో గ్రూపులు కట్టడంతో పాటు ఇతర కులాలకు చెందిన హీరోలను ద్వేషిస్తున్నట్టు, వేరే కులానికి చెందిన హీరో ఓ కూల్ డ్రింక్ యాడ్ చేయడం వల్ల అది తాగకూడదని నిర్ణయం తీసుకున్నట్టు చూపించారు. ఆ సీన్ కాంట్రవర్సీకి కారణం అయింది.
సోషల్ మీడియాలో 'ఎయిర్' వెబ్ సిరీస్ సన్నివేశం పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈటీవీకి సంస్థకు చెందిన ఓటీటీలో ఆ సన్నివేశం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. విమర్శలు ఈటీవీ సంస్థ దృష్టికి వెళ్లడంతో రియాక్ట్ అయ్యింది.
మరింత జాగ్రత్తగా... విలువలతో!ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉంటామని, వీక్షకులకు తాము అందించే కంటెంట్ గౌరవంతో ఉండేలా చూసుకుంటామని ఈటీవీ విన్ పేర్కొంది. ఒక ట్వీట్ చేసింది. అర్థం చేసుకున్నందుకు థాంక్స్ చెబుతూ మున్ముందు కూడా మద్దతు ఇవ్వాలని కోరింది. నేరుగా సారీ చెప్పలేదు కానీ పరోక్షంగా ఆ వివాదం గురించి ట్వీట్ చేసి విమర్శల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసింది.
Also Read: కాంట్రవర్సీలు ఫుల్... కలెక్షన్లు నిల్... లైలా to తమ్ముడు... బాయ్‌కాట్ ఎఫెక్ట్ ఉందా?
ఈటీవీ విన్ వివరణ ఇచ్చినా సరే చాలా మంది ఊరుకోవడం లేదు. ఆ సన్నివేశాలను డిలీట్ చేయమని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్స్ ఎలా తొలగిస్తారని అడుగుతున్నారు. యాప్ అన్ ఇన్‌స్టాల్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Also Read: నితిన్ 'తమ్ముడు' కథ కాపీనా... కార్తీ 'ఖైదీ'తో కంపేరిజన్స్ ఎందుకు?