మనోభావాల సెగ తగులుతోంది సినిమాలకు! నితిన్ 'తమ్ముడు' కావచ్చు, అంతకు ముందు విష్ణు మంచు 'కన్నప్ప' కావచ్చు, కన్నడలో లోక నాయకుడు కమల్ హాసన్ 'థగ్ లైఫ్' కావచ్చు, ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో వచ్చిన విశ్వక్ సేన్ 'లైలా' కావచ్చు. విడుదలకు ముందు వివిధ వర్గాల నుంచి ఆగ్రహావేశాలు ఎదుర్కొన్న సినిమాలే. చెబుతూ వెళితే వీటికి ముందు సినిమాల జాబితా పెరుగుతూ ఉంటుంది. అయితే... ఆయా సినిమాల మీద బాయ్ కాట్ ట్రెండ్ ఎఫెక్ట్ పడిందా?
కాంట్రవర్సీలకు కారణం ఏమిటి?విశ్వక్ సేన్ 'లైలా' విషయానికి వెళితే... అందులో నటుడు పృథ్వీ ఓ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా ఈవెంట్‌లో '11' అంటూ ఆయన జోక్స్ వేశారు. ''సినిమా షూట్ మొదలైన స్టార్టింగ్‌లో మా అసిస్టెంట్‌తో మేకలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమని అడిగా. అటు 70, ఇటు 80... మొత్తం 150 ఉన్నాయని చెప్పాడు. షూటింగ్ లాస్ట్ డే అడిగా... ఎన్ని మేకలు ఉన్నాయని! 11 అని చెప్పాడు. యాదృశ్చికంగా అలా జరిగింది'' అని పృథ్వీ అన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత 11 సీట్లు వచ్చాయి. పైగా, పృథ్వీ జనసేన నేత. దాంతో 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు.
తమిళం నుంచి కన్నడ పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల కర్ణాటక భగ్గుమంది. ఏకంగా 'థగ్ లైఫ్'ను బ్యాన్ చేసింది కన్నడ ఫిల్మ్ ఛాంబర్. సారీ చెప్పమని ఆదేశించింది బెంగళూరు హైకోర్టు. కమల్ సారీ చెప్పకపోవడంతో 'బాయ్ కాట్ థగ్ లైఫ్' అన్నారు కన్నడిగులు.
రీసెంట్ 'బాయ్ కాయ్ ఎస్వీసీ' ట్రెండ్ గురించి తెలిసిందే. 'తమ్ముడు' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో 'గేమ్ చేంజర్' గురించి శిరీష్ చేసిన కామెంట్స్, మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఫోన్ కూడా చేయలేదని చెప్పిన మాటలు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. వెంటనే శిరీష్ సారీ చెప్పారు. రీజన్స్ వేర్వేరు అయినప్పటికీ... ఆయా సినిమాలు విడుదల ముందు 'బాయ్ కాట్' ట్రెండ్ ఎదుర్కొన్నాయి. మరి, విడుదల తర్వాత?
ఫ్లాప్ సినిమాలపై ఎఫెక్ట్ పడిందా?విచిత్రం ఏమిటంటే... 'లైలా', 'థగ్ లైఫ్', 'తమ్ముడు' - ఈ ఏడాది బాయ్ కాట్ ట్రెండ్ ఎదుర్కొన్న మూడు సినిమాలకు మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ బరిలో మొదటి రోజు విజయం మీద ఆశలు చిగురించే స్టార్ట్ లభించలేదు. నితిన్ 'తమ్ముడు' రిజల్ట్ గురించి ఇప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుంది. వీకెండ్ కూడా కంప్లీట్ కాలేదు కనుక! కానీ మిగతా రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఒకవేళ ఆయా సినిమాలు హిట్ అయితే బాయ్ కాట్ ట్రెండ్ ఎఫెక్ట్ ఎంత పడింది? అనేది అంచనా వేయవచ్చు.
Also Read: నితిన్ 'తమ్ముడు' కథ కాపీనా... కార్తీ 'ఖైదీ'తో కంపేరిజన్స్ ఎందుకు?
కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో 'థగ్ లైఫ్' ఫ్లాపైంది. 'లైలా' ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేస్తూ విశ్వక్ సేన్ ఒక లెటర్ విడుదల చేశారు. డిజాస్టర్ సినిమాలు బాయ్ కాట్ ట్రెండ్స్‌లో చిక్కుకోవడం ఎంత విచిత్రమో... 'ఆయా సినిమాలపై బాయ్ కాట్ ఎఫెక్ట్ లేదు' అనేది కూడా అంతే నిజం. విడుదలకు ముందు వార్తల్లో నిలిచేలా చేస్తున్న వివాదాలు... థియేటర్లలో విడుదల తర్వాత వసూళ్లు తీసుకు రావడంలో, విజయం ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాయి. సాధారణ జనాలే ఆయా సినిమాలను బాయ్ కాట్ చేశారు. సో... బాయ్ కాట్ ట్రెండ్స్ చేసే జనాలు అందరూ ఇకనుంచి ఏం చేయాలో అర్థమైందా రాజా!! ఇంకా చెప్పాలంటే విడుదలకు ముందు బాయ్ కాట్ చేసిన జనాల కంటే విడుదలైన తర్వాత 'థగ్ లైఫ్'లో కమల్ - త్రిష ట్రాక్, 'లైలా'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, 'తమ్ముడు'లో సప్తమి గౌడ క్యారెక్టర్ మీద ఇతరులు ఎక్కువ విమర్శలు చేశారు.
Also Read: నితిన్ గురి తప్పింది... 'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?