పాన్ ఇండియా లెవెల్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna). నేషనల్ క్రష్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్స్. 'యానిమల్', 'పుష్ప 2', 'ఛావా', ఇటీవల 'కుబేర'తో ఆమె బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
చివరి దశకు చిత్రీకరణThe Girlfriend Movie Update: 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో రష్మిక మందన్నకు జంటగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు, ధీరజ్ మొగిలినేని - విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని నిర్మాతలు చెప్పారు.
Also Read: ప్రేక్షకులకు 'వర్జిన్ బాయ్స్' బంపర్ ఆఫర్లు... థియేటర్లలో తొక్కిసలాట జరిగితే బాధ్యత ఎవరిది?
త్వరలో విడుదల తేదీ...ఈ నెలలో రిలీజ్ డేట్ అనౌన్స్!The Girlfriend movie first single will be released this July: 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని, ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో శరవేగంగా జరుగుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ''రష్మిక, దీక్షిత్ శెట్టిపై పాటను తెరకెక్కిస్తున్నాం. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాం. ఈ సినిమాలో పాటను ఈ నెలలో విడుదల చేస్తాం'' అని చెప్పారు.
Also Read: వెంకటేష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్... వాళ్ళిద్దరి టార్గెట్ అదేనా!?