దర్శకుడిగా పరిచయమైన 'మానగరం'తో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రశంసలు అందుకున్నారు. అయితే, కార్తీ 'ఖైదీ' (Karthi's Khaidi Movie)తో ఆయనకు ఎక్కువ పేరు వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకు అంటే... నితిన్ 'తమ్ముడు' విడుదలైన తర్వాత కార్తీ 'ఖైదీ' గుర్తుకు వచ్చిందని క్రిటిక్స్ కొందరు కామెంట్ చేశారు. రెండు సినిమాల మధ్య కంపేరిజన్స్ రావడానికి కారణం ఏమిటి? 'ఎంసీఏ' ఛాయలు కనిపించాయని కొందరు ఎందుకు చెబుతున్నారు? డిటెయిల్డ్ అనాలలిస్‌లోకి వెళితే...
కార్తీ 'ఖైదీ' కథ ఏమిటి? క్లుప్తంగా చూస్తే...పోలీస్ శాఖలో ఉన్నతాధికారి ఒకరు రిటైర్మెంట్ సందర్భంగా పార్టీ ఇస్తారు. అక్కడ మందులో డ్రగ్స్ కలపడం వల్ల... పోలీసులంతా మత్తులో స్పృహ తప్పి పడతారు. ప్రజలకు విషయం తెలిస్తే ఆందోళనకు గురి అవుతారని ఎవరికీ తెలియకుండా ఒక క్యాటరింగ్ వ్యాన్‌లో హీరో ఢిల్లీ (కార్తీ)ని ఆస్పత్రికి తీసుకు వెళ్లమని ఒక పోలీస్ అడుగుతారు. దారిలో అడుగడుగునా పోలీసుల మీదకు ఎవరెవరో ఎటాక్ చేస్తారు. కారణం ఏమిటంటే... పెద్ద డ్రగ్ రాకెట్‌ను పోలీసులు బరస్ట్ చేస్తారు. దాంతో పోలీసుల మీద డ్రగ్ మాఫియాకు చెందిన మనుషులు ఎటాక్ చేస్తారు. వాళ్ళను కార్తీ కాపాడతాడు.
నితిన్ 'తమ్ముడు' కథ ఏమిటి? ఓ లుక్ వేస్తే...Nithiin's Thammudu Story Explained In Detail: ఝాన్సీ కిరణ్మయి (లయ) ప్రభుత్వ ఉద్యోగి. కుటుంబంతో కలిసి అంబర్ గొడుగు అనే ఊరిలో పగడాలమ్మ తల్లి జాతరకు వెళుతుంది. విశాఖలో అజర్వాల్ (సౌరబ్ సచ్‌దేవ్)కు చెందిన ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఎంతో మంది మరణిస్తారు. దానిపై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేస్తుంది. వాస్తవానికి అది ప్రమాదం కాదు... కంపెనీ నష్టాల్లో ఉందని, ఇన్సూరెన్స్ డబ్బు కోసం అజర్వాల్ చేయిస్తాడు. నిజ నిర్ధారణ కమిటీలో ప్రభుత్వ అధికారులను భయపెట్టి తనకు అనుకూలంగా రిపోర్ట్ రెడీ చేయిస్తాడు అజర్వాల్. అయితే, ఝాన్సీ సంతకం చేయదని వాళ్లంతా చెబుతారు.
అంబర్ గొడుకులో ఝాన్సీ కిరణ్మయి కుటుంబాన్ని చంపేయమని అజర్వాల్ మనుషులను పంపిస్తాడు. అక్కడ వాళ్ళకు అండగా హీరో జై (నితిన్) ఉంటాడు. దారి మధ్యలో అడుగడుగునా ఎంత మంది ఎటాక్ చేసినా సరే కాపాడతాడు. ఇదీ క్లుప్తంగా కథ.
నితిన్ 'తమ్ముడు' వర్సెస్ కార్తీ 'ఖైదీ'...రెండు సినిమాల్లో కామన్ థింగ్స్ ఏంటి?నితిన్ 'తమ్ముడు', కార్తీ 'ఖైదీ'... రెండు సినిమా కథలు గమనిస్తే? రెండిటి నేపథ్యం వేర్వేరు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో 'ఖైదీ' వెళితే... బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో 'తమ్ముడు' సాగింది. నేపథ్యాలు వేరైనా రెండిటిలో కోర్ పాయింట్, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, యాక్షన్ సీన్స్ డిజైన్ ఒక్కటే... రౌడీల నుంచి కొందర్ని హీరో కాపాడటం!
Also Read: నితిన్ గురి తప్పింది... 'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీ కార్తీ (సినిమాలో రోల్ ఢిల్లీ). తన కూతుర్ని ఓసారి చూడాలని కోటి ఆశలతో ఉంటాడు. ఇండియాకు గోల్ మెడల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్చరీ ప్లేయర్ నితిన్ (సినిమాలో రోల్ జై). అయితే తాను చేసిన ఒక్క పొరపాటు వల్ల అక్కకి దూరం అవుతాడు. ఆమెతో ఒక్కసారి 'తమ్ముడు' అని పిలిపించుకోవాలని అనుకుంటాడు. ఆ సెంటిమెంట్స్ పక్కన పెడితే... ఈ రెండు సినిమాలో వెహికల్స్ కీ రోల్ ప్లే చేశాయి. పోలీసులు ఉన్న ట్రక్కును కార్తీ డ్రైవ్ చేయడమే కాదు... వాళ్ళను కాపాడటానికి వీరోచితంగా పోరాడతాడు. అక్క ఫ్యామిలీని ఒక బస్సులో తీసుకుని బయలు దేరతాడు నితిన్. విలన్స్ మీద విరుచుకుపడతాడు. ఎమోషన్స్ వేరైనా రెండు సినిమాలూ ఒక్కటే లైనులో ముందుకు వెళుతూ ఉంటాయి. యాక్షన్ బ్లాక్స్ వేరు గానీ షో ఒక్కటే. దారి పొడుగునా ఎటాక్ చేసే మనుషులు, కాపాడే హీరో... అందువల్ల రెండు సినిమాల మధ్య కంపేరిజన్స్ ఎక్కువ వస్తున్నాయి.
Also Read: ప్రేక్షకులకు 'వర్జిన్ బాయ్స్' బంపర్ ఆఫర్లు... థియేటర్లలో తొక్కిసలాట జరిగితే బాధ్యత ఎవరిది?
దర్శకుడు శ్రీరామ్ వేణు తీసిన 'ఎంసీఏ' ఛాయలు ఉన్నాయనే మాట ఎందుకు వస్తుందంటే... 'ఎంసీఏ'లో భూమిక ప్రభుత్వ అధికారి. 'తమ్ముడు'లో లయ కూడా ప్రభుత్వ అధికారి. 'ఎంసీఏ' భూమికకు హీరో మరిది అయితే... 'తమ్ముడు'లో లయకు హీరో తమ్ముడు. రెండు సినిమాల్లో హీరో, విలన్ మధ్య ఎటువంటి శత్రుత్వం ఉండదు. 'ఎంసీఏ'లో వదిన కోసం, 'తమ్ముడు'లో అక్క కోసం... హీరోలు రంగంలోకి దిగుతారు. అదీ సంగతి! అందుకని, కాపీ అని చెప్పలేం. ఒకేలా కనిపించే వేర్వేరు కథలంతే!