Trollings On Ranbir Kapoor Who Plays Lord Rama Role In Ramayana: ఇండియన్ మూవీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మైథలాజికల్ ఎపిక్ 'రామాయణ'. ఈ మహా ఇతిహాసాన్ని ఎంతోమంది ఎన్నోసార్లు సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించినా ఏదో స్పెషల్. సీతారాముల కథను మరోసారి ఆడియన్స్‌కు అందించబోతున్నారు డైరెక్టర్ నితేశ్ తివారీ.
'రామాయణ'లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. లంకాధిపతి రావణునిగా యష్ నటించారు. ఇటీవల రిలీజ్ అయిన మూవీ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించింది. 3 నిమిషాల విజువల్ వండర్ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. 'మనిషిని సృష్టించేది బ్రహ్మ... కాపాడేది విష్ణువు... మట్టిలో కలిపేసేది శివుడు... సృష్టికి విఘాతం కలిగినప్పుడు శ్రీరాముడు అవతరిస్తాడు.' అనేలా గ్లింప్స్ వీడియోలో చూపించారు.
రణబీర్‌పై ట్రోలింగ్స్
'రామాయణ' మూవీ గ్లింప్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. అయితే... కొందరు నెటిజన్లు రణబీర్ కపూర్‌పై విమర్శలు చేశారు. 'బాలీవుడ్‌లో ఏం జరుగుతోంది. బీఫ్ తినేవాడు రాముడి పాత్ర పోషించడమా?' అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సింగర్ చిన్మయి సదరు నెటిజన్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
'దేవుడి పేరుతో ఓ బాబాజీ రేపులు చెయ్యొచ్చు. మళ్లీ బయటకు రావొచ్చు. ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు రాజ్యమేలవచ్చు. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారు అంటే అదే పెద్ద సమస్య కాదు.' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
సోషల్ మీడియాలో వార్
ఇక వరుస ట్వీట్స్‌తో సోషల్ మీడియాలో ఓ సైలెంట్ వారే జరుగుతోంది. 'ఒక చెడ్డ పనిని మరో చెడ్డ పనితో ఎలా పోలుస్తారు.' అంటూ ఓ నెటిజన్ చిన్మయిని ప్రశ్నించగా... 'అలాంటి వాళ్లు రాజ్యమేలుతుంటే మీకు లేని ప్రాబ్లం హీరో బీఫ్ తింటే ప్రాబ్లం ఏం వచ్చింది.' అంటూ సమాధానం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ 'మీరు ఫెమినిస్ట్... ఈ మేటర్ లోకి దూరకండి' అంటూ వార్నింగ్ ఇచ్చారు. దానికి కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు చిన్మయి. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
Also Read: డైరెక్టర్ To హీరో - తరుణ్ భాస్కర్ 'ఓం శాంతి శాంతి శాంతి' - రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
భారీ బడ్జెట్... 2 పార్టులు
దాదాపు రూ.1600 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణునిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్ఫణఖగా రకుల్, కైకేయిగా లారాదత్తా కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, వీఎఫ్ఎక్స్ స్టూడియో డీఎన్ఈజీ, యష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాతో యష్ నిర్మాతగా మారుతున్నారు. 2026 దీపావళికి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.