Tharun Bhascker's Om Shanti Shanti Shanti Release Date: డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్యూటీ ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి'. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

అప్పుడే రిలీజ్

ఈ మూవీని ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా 'మీ కొత్త రుతుపవన విందు' అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. దీనికి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తుండగా... అంబటి ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్ భాస్కర్ నటిస్తున్నారు. ఆయన సరసన ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

మలయాళ మూవీకి రీమేక్

మలయాళం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'జయ జయ జయహే' మూవీకి ఇది రీమేక్. బసెల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్ జంటగా నటించిన ఈ మూవీ 2022లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో తరుణ్ భాస్కర్ హీరోగా 'ఓం శాంతి శాంతి శాంతి'గా రీమేక్ చేస్తున్నారు.

Also Read: కాంప్రమైజ్ అయితే పెళ్లి... కాంట్రవర్సీ చేస్తే ఫైట్ - గెస్ట్ రోల్స్‌లో టాప్ డైరెక్టర్స్... సుహాస్ 'ఓ భామ అయ్యో రామ' ట్రైలర్ చూశారా?

డైరెక్టర్ To హీరో

డైరెక్టర్‌గా ఎన్నో మంచి హిట్ మూవీస్ అందించిన డైరెక్టర్ ఇప్పుడు 'ఓం శాంతి శాంతి శాంతి' మూవీతో హీరోగా మారనున్నారు. ఫస్ట్ మూవీ 'పెళ్లి చూపులు'తోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' మూవీతో మరో హిట్ కొట్టారు. ఆ తర్వాత కామెడీ ఎంటర్‌టైనర్ 'కీడా కోలా'తో ముందుకొచ్చారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూనే ఆయన ఓ కీలక పాత్రలోనూ కనిపించారు. తరుణ్ ప్రధాన పాత్రలో 'మీకు మాత్రమే చెప్తా' అనే మూవీ వచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా కొత్త మూవీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నారు.

హీరోయిన్ ఈషా రెబ్బా తనదైన అందం, యాక్టింగ్‌తో ఆడియన్స్ మనసు దోచేశారు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె... అమీ తుమీ, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సవ్యసాచి, రాగల 24 గంటల్లో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మాయా మశ్చీంద్ర మూవీస్‌లో నటించి మెప్పించారు. ఇప్పుడు మరో మూవీతో అలరించబోతున్నారు.