Big Shock To Disney Plus Hotstar: ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటివి ఉన్నాయి. వాటిలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఒకటి. అయితే ఈ ఏడాది మంచి కంటెంట్ ఉన్న సినిమాల రైట్స్‌ను దక్కించుకోవడంలో నెట్ ఫ్లిక్స్ దూకుడు చూపిస్తోంది. ఫలితంగా ఈ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు హాట్ స్టార్ కూడా వెనుకబడిపోయింది. తాజాగా హాట్ స్టార్ రూ.274 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందనే విషయం వెలుగులోకి వచ్చింది.
భారతదేశంలో హాట్ స్టార్ కు భారీ నష్టాలు
భారతదేశంలో మంచి డిమాండ్ ఉన్న ఓటీటీల్లో డిస్ని ప్లస్ హాట్ స్టార్ కూడా ఒకటి. కానీ తాజాగా హాట్ స్టార్‌కి పెద్ద దెబ్బ తగిలింది. 2025 మొదటి మూడు నెలల్లో హాట్ స్టార్ భారీ నష్టాలను చూడబోతోంది. కొత్త బిజినెస్ మాడ్యూల్ కారణంగా ఈ కంపెనీ భారీ నష్టాలను చవిచూసిందని తెలుస్తోంది. సమాచారం ప్రకారం హాట్ స్టార్ కంపెనీకి రూ.274 కోట్ల భారీ నష్టం వాటితోందని తెలుస్తోంది. అంతేకాదు హాట్ స్టార్ ఇండియాలో 7 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఇది హాట్ స్టార్‌కి అతిపెద్ద షాక్ అని చెప్పాలి. మరోవైపు హాట్ స్టార్ పనితీరు కూడా చాలా బలహీనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
కొత్త బిజినెస్ మాడ్యూల్ కారణంగా డిస్నీ భారతదేశంలో పట్టు కోల్పోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రపంచ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ రూ.70,352 కోట్ల విలువైన ఈ వ్యూహాత్మక జాయింట్ వెంచర్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రిలయన్స్ కూడా సంబంధించిన వయాకామ్18 మీడియా కార్యకలాపాలను డిస్నీకి సంబంధించిన స్టార్ ఇండియాతో విలీనం చేశారు. ఇందులో రిలయన్స్ వాటా 56%, డిస్నీ వాటా 37% ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ రంగంలో హాట్ స్టార్ రెట్టింపు లాభాలను సంపాదించింది. కానీ భారతదేశంలో మాత్రం డిస్నీ బిజినెస్ బాగా బలహీన పడిందని చెప్పాలి. అందుకే కంపెనీకి రూ.274 కోట్ల భారీ నష్టాలు రాబోతున్నాయని అంటున్నారు. అలాగే డిస్నీ ప్రస్తుతం ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోవడంతో ఇప్పుడు హాట్ స్టార్‌కి ఉన్న సబ్స్క్రైబర్ల లిస్ట్ 125 మిలియన్లకు పడిపోయింది.
తగ్గిన హాట్ స్టార్ ఆదాయం
డిస్నీ అండ్ హాట్ స్టార్ రెండింటి ప్రకటనల ఆదాయం కూడా 2 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఇండియాను మినహాయిస్తే మొత్తం 16% ప్రకటనల ఆదాయం పెరిగింది. నిజానికి హాట్ స్టార్ నుంచి ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ చేజార్చుకున్నప్పటి నుంచి సబ్స్క్రైబర్లు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నారు. ఇది నిజంగానే డిస్నీ ఇండియాను టెన్షన్ పెట్టే విషయం. ఈ నేపథ్యంలోనే డిస్నీ ఇప్పుడు ఈఎస్పిఎన్తో పాటు డిజిటల్ ఎంటర్టైన్మెంట్‌పై దృష్టి పెట్టబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు నెట్ ఫ్లిక్స్ మాత్రం దూకుడు చూపిస్తుంది. ఈ ఏడాది సౌత్‌లో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్‌ల రైట్స్ అన్నీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అలాగే బాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ సినిమాలు, సిరిస్‌ల లిస్టులు కూడా ఇటీవలే నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. అలా నెట్ ఫ్లిక్స్ కారణంగా కూడా మిగతా ఓటీటీలపై పెద్ద దెబ్బ పడింది.
Read Also : Naga Chaitanya : "యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు?" నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్