Naga Chaitanya : "యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు?" నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్
Naga Chaitanya : ' తండేల్' రిలీజ్ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ట్విట్టర్ వేదికగా నాగ చైతన్యకు అభిమానుల తరపున కొన్ని ప్రశ్నలు అడిగిన వీడియోను షేర్ చేసింది.
Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్'. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీతో నాగచైతన్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు ఆయన. తాజాగా సాయి పల్లవి తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోలో కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలను చైతన్యకు సంధించారు. అందులో ఓ అభిమాని ఏకంగా నాగ చైతన్యను యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు ? అని అడగడం, దానికి నాగ చైతన్య ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారాయి.
నాగ చైతన్య యాక్టింగ్ గురించి ప్రశ్న...
తాజాగా సాయి పల్లవి తన ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోలో నాగ చైతన్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ముందుగా "ఎందుకు ఈ సినిమాను ఎక్స్ట్రా పర్సనల్ గా తీసుకున్నారు? ఈ మూవీ కోసం ఇంతకుముందు ఎన్నడు చేయని విధంగా ఎక్స్ట్రా రీల్స్ లాంటి ఎక్స్ట్రా ప్రమోషన్స్ కూడా చేశారు" అని అడిగింది. నాగచైతన్య స్పందిస్తూ "హానెస్ట్ గా చెప్తున్నాను ఇదొక రియల్ స్టోరీ, రియల్ క్యారెక్టర్. ఒక యాక్టర్ గా నేను ఇప్పుడు హిట్టు కోసం ఆకలి మీద ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యి, ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోతుంది. నువ్వు ఎన్ని సినిమాలు రిలీజ్ చేసావ్? మూడు నాలుగు సినిమాలు చేశావు" అంటూ సరదాగా నవ్వేశారు నాగచైతన్య. "బాయ్స్ కి బడ్జెట్లో స్కిన్ కేర్ చెప్పండి?" అని సాయి పల్లవి మరో ప్రశ్న అడగ్గా.. నాగ చైతన్య "అమ్మాయిల్ని ఏడిపించకండి... మీ స్కిన్ దానికి అదే గ్లో అవుతుంది. హ్యాపీ గా ఉండండి బ్రదర్" అని చెప్పారు.
యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు?
"యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు?" అనే ఓ నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య రియాక్ట్ అవుతూ "ఎప్పుడు నేర్చుకుంటావు ఏంటి? నిజానికి ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. కాలం గడిచే కొద్ది నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటికీ ఈ ప్రాసెస్ కి ఫుల్ స్టాప్ పెట్టొద్దు. ఒకవేళ ఫుల్ స్టాప్ పెడితే గనక నటుడుగా ఎదగడం మానేసినట్టే. అంటే ఫ్యూచర్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. నేను ఇంకా నేర్చుకోలేదు... ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉన్నాను" అని చెప్పారు నాగచైతన్య. అభిమాని తనను, తన యాక్టింగ్ స్కిల్స్ ను టార్గెట్ చేసినట్టుగా ప్రశ్నించినా, నాగ చైతన్య మాత్రం కూల్ గా, మెచ్యూర్ గా సమాధానం చెప్పడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
'తండేల్' టీమ్ అరెస్ట్
"నాగచైతన్య రిచ్ కిడ్ లాంటి రోల్స్ కి సెట్ అవుతాడు. మరి శ్రీకాకుళం మత్సకారుడిగా ఎలా ఊహించుకున్నాడు?" అన్న ప్రశ్నకు "ఒక నటుడి పని అదే కదా... ఎలాంటి రోల్ కావాలంటే దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి" అంటూ చెప్పుకొచ్చారు చై. "వాటర్ పై షూటింగ్ చేయడం ఎలా ఉంది? షూటింగ్ జరుగుతున్నప్పుడు మీరు మర్చిపోలేని మెమొరబుల్ సంఘటన ఏంటి?" అనే ప్రశ్నకు "వాటర్ పై షూటింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇక మెమొరబుల్ ఇన్స్టంట్ అంటే... కేరళలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేవీ అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు" అంటూ నాగ చైతన్య చెప్పగా, సాయి పల్లవి "ఇదెప్పుడు జరిగింది" అంటూ ఆశ్చర్యపోయింది. "నెగెటివ్ క్యారెక్టర్స్ నాగ చైతన్య ఎప్పుడు చేస్తారు?" అంటే "సాయి పల్లవి దర్శకత్వం వహించినప్పుడు" అని చెప్పారు చై.