Thandel Movie OTT Streaming: అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన మోస్ట్ అవెయిటింగ్ సర్వైవల్ పాన్ ఇండియా థ్రిల్లర్ 'తండేల్'. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 7) థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు థియేటర్లలో అక్కినేని అభిమానులు 'తండేల్' మూవీని సెలబ్రేట్ చేసుకుంటుంటే, మరోవైపు ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోంది అనే విషయం ఆసక్తికరంగా మారింది.

'తండేల్' ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ? 'తండేల్' మూవీ థియేట్రికల్ రన్ పూర్తయిన తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ ఈ మూవీని సంబంధించిన దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌‌తో భారీ ధరకు డిజిటల్ రైట్స్ డీల్‌ను సెట్ చేసుకున్నారని సమాచారం. 'తండేల్' ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ రూ.65 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 'తండేల్' దర్శకుడు చందూ మొండేటి ప్రమోషన్ల సమయంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఓటీటీ డీల్ పాటు రైట్స్ ద్వారానే బడ్జెట్‌లో సగానికి పైగా ఇప్పటికే రికవరీ అయ్యాయని వెల్లడించారు.

'తండేల్' ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం ?సాధారణంగా సినిమాలు థియేటర్లలోకి వచ్చిన 4 వారాల తరువాత ఓటీటీలోకి అడుగుపెడతాయి. కానీ 'తండేల్' ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం ఆలస్యం అవుతుందని అంటున్నారు. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, 'తండేల్' సినిమా 50 రోజులు థియేటర్లలో ఆడిన తరువాతే, ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని, ఈ మేరకు నిర్మాత అల్లు అరవింద్ నెట్‌ఫ్లిక్స్‌తో లాక్ చేశారని తెలుస్తోంది. అల్లు అరవింద్‌తో పాటు చిత్రబృందం ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ, 'గేమ్ ఛేంజర్' విషయంలో కూడా ఇదే జరిగింది. నిర్మాత దిల్ రాజు 'గేమ్ ఛేంజర్' కోసం ప్రైమ్ వీడియోతో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్నాడు థియేటర్లలో విడుదలైన కనీసం 56 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ కావడంతో మళ్లీ డేట్‌ను మార్చారు. 

కాగా 'తండేల్' మూవీ శ్రీకాకుళం మత్స్యకారుల నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ జాలరి తనకు తెలియకుండానే పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి పట్టుబడతాడు. దాదాపు ఏడాది పాటు కరాచీలోనే జైలు శిక్ష అనుభవించిన ఆ జాలరి, అతనితో పాటు ఉన్న మరికొందరు చిత్రహింసలకు గురై...  సరైన ఆహారం, దుస్తులు లేకుండా కష్టపడతారు. మరి వీళ్ళు తిరిగి ఇండియాకు ఎలా వచ్చారు అన్నది ఈ మూవీ స్టోరీ. 

'తండేల్' అడ్వాన్స్ బుకింగ్స్ మరోవైపు 'తండేల్' మూవీ మొదటి రోజు ఎన్ని కోట్లు కొల్లగొడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ ప్రీ సెల్స్ కలెక్షన్స్ భారీగానే ఉన్నాయి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 'తండేల్' రూ. 70 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగ చైతన్య కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమా 'తండేల్' కానుంది. 

Read Also : Thandel Movie Leaked : 'తండేల్' టీమ్‌కు షాకిచ్చిన లీకు రాయుళ్ళు - థియేటర్లలోకి వచ్చిన గంటల్లోనే మూవీ HD వెర్షన్ లీక్