Naga Chaitanya's Maya Sabha Web Series Slated To Stream On Last Quarter Of This Year: 'తండేల్' మూవీ సక్సెస్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఫుల్ బిజీగా మారారు. 'ప్రస్థానం' ఫేం దేవకట్టా దర్శకత్వంలో 'మయసభ' అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్‌పై తాజాగా సోషల్ మీడియా వేదికగా దేవకట్టా బిగ్ అప్ డేట్ ఇచ్చారు.
అప్పుడే స్ట్రీమింగ్
నాగచైతన్యతో 'మయసభ' సిరీస్ సీజన్ 1 షూటింగ్ దాదాపు పూర్తైందని.. ఈ ఏడాది చివరి క్వార్టర్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు దర్శకుడు దేవకట్టా తెలిపారు. 'ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ప్రసారం కానున్న #MAYASABHA సీజన్ 1 400 నిమిషాలు చేయడం ఆనందించాను. నాకు అత్యంత ఇష్టమైన నటుడు/నటుల్లో ఒకరిని దర్శకత్వం వహించడానికి కూడా స్క్రిప్ట్ రాస్తున్నాను.' అని నెట్టింట పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. దీంతో చైతూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో నాగచైతన్యతో పాటు ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిరీస్‌లో చైతూ రోల్ ఏపీ మాజీ సీఎం వైఎస్‌ను పోలి ఉంటుందని తెలుస్తుండగా.. ఆది రోల్ ఏపీ సీఎం చంద్రబాబును పోలి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
'వెన్నెల'తో దేవకట్టా కెరీర్ ప్రారంభం
దర్శకుడు దేవకట్టా 'వెన్నెల' వంటి కామెడీ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని శర్వానంద్‌తో ప్రస్థానం మూవీ తీశారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో ప్రశంసలు, అవార్డులు కైవసం చేసుకుంది. ఆ తర్వాత నాగచైతన్యతోనే 'ఆటోనగర్ సూర్య' చేశారు దేవకట్టా. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. 'ప్రస్థానం' మూవీని హిందీ రీమేక్ చేసినా అనుకున్నంత విజయం సాధించలేదు.
ఆ తర్వాత సాయిదుర్గా తేజ్‌తో 'రిపబ్లిక్' మూవీ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నా కమర్షియల్‌గా అంత సక్సెస్ కాలేదు. ఇక పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో 'ఇంద్రప్రస్థం' సినిమా అనౌన్స్ చేశారు. అయితే, స్టోరీ పెద్దది కావడంతో సినిమాకా కాకుండా వెబ్ సిరీస్‌గా రూపొందించారు. ఆ తర్వాత టైటిల్‌ను 'మయసభ'గా మార్చారు. ఈ సిరీస్ ఈ ఏడాది చివరి 3 నెలల్లో ఎప్పుడైన ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది.
అటు, నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'ధూత' వెబ్ సిరీస్‌తోనే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ సైతం అంతే సక్సెస్ కావాలంటూ ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.