Latest OTT Movies Streaming: మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా ప్రముఖ ఓటీటీలు.. హారర్, క్రైమ్, కామెడీ, రొమాంటిక్ వంటి వివిధ జానర్లలో కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు వివిధ భాషల్లో దాదాపు 14 సినిమాలు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటే వెబ్ సిరీస్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి.

ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్

ప్రముఖ ఓటీటీలు నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జీ5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వివిధ భాషల్లో మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. 

నెట్ ఫ్లిక్స్ - ఐ హోస్టేజి (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ), ఓక్లోహోమా సిటీ బాంబింగ్: అమెరికన్ టెర్రర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)

అమెజాన్ ప్రైమ్ వీడియో - విష్ణుప్రియ (కన్నడ రొమాంటిక్ డ్రామా), ఖౌఫ్ (హారర్ మిస్టరీ థ్రిల్లర్ - హిందీ వెబ్ సిరీస్), ది నారో రోడ్ టు ది డీప్ నార్త్ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ వెబ్ సిరీస్).

జీ5 - దావీద్ (మలయాళ యాక్షన్ థ్రిల్లర్), లాగౌట్ (హిందీ సైబర్ థ్రిల్లర్ డ్రామా)

Also Read: 'కేసరి చాప్టర్ 2' ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామాపై నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఆహా తమిళ్ - శివంగి లయనెస్ (తమిళ థ్రిల్లర్ డ్రామా)

యాపిల్ ప్లస్ టీవీ - జేన్ సీజన్ 3 (ఇంగ్లీష్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)

ముబి ఓటీటీ - గ్రాండ్ టూర్ (ఇంగ్లీష్ అడ్వెంచరస్ డ్రామా మూవీ)

హోయ్ చోయ్ ఓటీటీ - షోటీ బోలో షోటీ కిచ్చు నీ (బెంగాలీ లీగల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ - మేరీ హస్బెండ్ కీ బీవీ (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ), లా అండ్ ఆర్డర్: ఆర్గనైజ్‌డ్ క్రైమ్ సీజన్ 5 (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేషన్ లీగల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్), ది వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిల్మ్)

ఈ మూవీస్, వెబ్ సిరీస్‌ల్లో రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ 'మేరీ హస్బెండ్ కీ బీవీ', శివంగి లయనెస్, హారర్ థ్రిల్లర్ సిరీస్ ఖౌఫ్, ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖౌఫ్, రొమాంటిక్ డ్రామా మూవీ విష్ణుప్రియ, సైబర్ క్రైమ్ థ్రిల్లర్ లాగౌట్ వంటి సినిమాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.