Darling 2024 OTT Release Update: ప్రియ‌ద‌ర్శి, న‌భా న‌తాష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'డార్లింగ్'. జులై 19న రిలీజైన ఈ సినిమాకి ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. రిలీజైన నెల రోజుల‌కంటే ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది ఈ సినిమా. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రి ఎక్క‌డ రిలీజ్ అవుతుంది? స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచి ఒక‌సారి చూద్దాం. 


స్ట్రిమింగ్ ఎప్పుడు? ఎక్క‌డంటే? 


'డార్లింగ్' సినిమా కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కింది. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా ఆయ‌న స‌ర‌స‌న న‌భ నతాష్ న‌టించారు. ఆమె చాలా కాలం త‌ర్వాత తెలుగులో సినిమా చేశారు. కాగా.. ఈసినిమా ఓటీటీ రైట్స్ డిస్నీ + హాట్ స్టార్ ద‌క్కించుకుంది. సినిమా రిలీజ్ కంటే ముందే మంచి డీల్ తో అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది డిస్నీ + హాట్ స్టార్. ఆగ‌స్టు 13 నుంచి ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పింది. రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తూ ఒక స్పెష‌ల్ పోస్ట‌ర్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 






మిశ్ర‌మ స్పంద‌న‌.. 


ప్రియ‌ద‌ర్శి నిజానికి క‌మెడియ‌న్ గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న హీరోగా కొన్ని సినిమాలు చేశారు. చాలా సెల‌క్టివ్ గా, మంచి మంచి క‌థ‌లు ఎన్నుకుంటారు ప్రియ‌ద‌ర్శి. హీరో అయిన‌ప్ప‌టికీ మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాడు. అలా ఈ సినిమా కూడా కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కింది. అయితే ప్రేక్ష‌కుల‌ను మాత్రం సినిమా అంత‌గా అల‌క‌రించ‌లేదు. కామెడీ బాగున్న‌ప్ప‌టికీ మిగ‌తా ఎలిమెంట్స్ మెప్పించ‌లేదు. దీంతో మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అనుకున్నంద‌గా ఆడ‌లేదు 'డార్లింగ్' సినిమా. 


ఇక ఈ సినిమాకి 'హనుమాన్' వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ప్రేక్షకులకు అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దంపతులు నిర్మించారు. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించగా... వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా అన‌న్య నాగెళ్ల కూడా న‌టించారు. 


క‌థేంటంటే? 


ఈ సినిమాని లేడీ అప‌రిచితుడు కాన్పెప్ట్ అని చెప్పొచ్చు. ఇక క‌థ విష‌యానికొస్తే..  రాఘవ్ (ప్రియదర్శి) ఓ ట్రావెల్ ఏజెన్సీలో జాబ్ చేస్తుంటాడు. పెళ్లైన తర్వాత భార్యతో కలిసి పారిస్‌కు హనీమూన్ వెళ్లాలని ఆయ‌న క‌ల‌. దానికోసం ప్రతి నెల జీతంలో కొంత సేవింగ్స్ చేస్తాడు. అయితే, సైకాలజిస్ట్ గా నందిని (అనన్యా నాగళ్ల)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ, ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడాలని ఆమె వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని రాఘవ్ నిర్ణయం తీసుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన రాఘవ్ కు ఆనంది (నభా నతాష్) పరిచయం అవుతుంది. ఆమెకు ప్రపోజ్ చేయడంతో పాటు కొన్ని గంటల్లో పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెకు స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుస్తుంది. ఆనంది బాడీలోకి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఐదుగురు ప్ర‌వేశిస్తారు. వాళ్లు ఎవరు? వాళ్లను దాటుకుని భార్యను తన సొంతం చేసుకోవడం కోసం రాఘవ్ ఏం చేశాడు? ఆనందితో జీవితం అంతా హాయిగా ఉంటుందా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూడాల్సిందే. 


Also Read: ‘ఖేల్ ఖేల్ మే’ ట్రైలర్ విడుదల - ఈ గేమ్ చాలా డేంజర్, కపుల్స్ మాత్రం అస్సలు ఆడొద్దు!