గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'డాకు మహారాజ్'. బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్‌ రెడీ అయింది.


ఫిబ్రవరి 21న 'డాకు మహారాజ్' ఓటీటీ రిలీజ్
Balakrishna's Daaku Maharaaj OTT Release Date Netflix: 'డాకు మహారాజ్' థియేటర్లలో విడుదలకు కావడానికి ముందు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తీసుకుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ గురించి ఈ రోజు అధికారికంగా వెల్లడించింది.


ఫిబ్రవరి 21వ తేదీ నుంచి తమ ఓటీటీ వేదికలో 'డాకు మహారాజ్' సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ కలిపింది. 'అనగనగా ఒక రాజు... చెడ్డవాళ్ళు అందరూ డాకు అనేవాళ్లు... కానీ మాకు మాత్రం మహారాజు' అని మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలో సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే, ఆ విషయం నెట్‌ఫ్లిక్స్‌ చెప్పలేదు.


Also Readచిరంజీవితో సాయి దుర్గా తేజ్... 'విశ్వంభర'లో మామా అల్లుళ్ళ సందడి చూసేందుకు రెడీ అవ్వండమ్మా, మేనల్లుడి రోల్ ఏమిటో తెల్సా!?






బాలకృష్ణకు విలన్ రోల్ చేసిన బాబీ డియోల్
'డాకు మహారాజ్' సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా... విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ నటించారు. ఆయన భార్య పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ కనిపించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో‌ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ - అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన చిత్రం ఇది.


Also Readక్రిస్టియన్ వెడ్డింగ్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్... వైట్ గౌనులో ఏంజెల్‌లా మహానటి



'డాకు మహారాజ్' కథ విషయానికి వస్తే... మంచి నీటి కోసం ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్న చోట వాళ్ళ బాధలు తీర్చడం కోసం ఒక సివిల్ ఇంజనీర్ వెళతాడు. అయితే ఆ ప్రజలను తమ గ్రానైట్ క్వారీలలో పనికి ఉపయోగించుకునే ఒక పెద్ద కుటుంబం అతడిని అడ్డుకుంటుంది. ఎదురు తిరిగిన సివిల్ ఇంజనీర్ షాక్ అయ్యే విషయం తెలుసుకుంటాడు. గ్రానైట్ ముసుగులో డ్రగ్స్ దందా జరుగుతుందని కనిపెడతాడు. చివరికి ఆ డ్రగ్ దందాను ఎలా అడ్డుకున్నాడు? ఆ ప్రజల పాలిట దేవుడిగా ఎలా నిలిచాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన 'డాకు మహారాజ్' బాలకృష్ణ ఖాతాలో మరో భారీ విజయంగా నిలిచింది.