Arjun Sarja's Blast Zone OTT Platform Locked : చాలా రోజుల తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'బ్లాస్ట్ జోన్'. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మహిళా సాధికారత, ఆడపిల్లల్లో ధైర్యం పెంపొందించే మెసేజ్‌తో మూవీ రూపొందింది. ఈ  సినిమా ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత సినిమా ఓటీటీల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించగా... అభిరామి, ప్రీతి ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. సినిమాలో కరాటే మాస్టర్‌గా అర్జున్ కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్‌లో అర్జున్ కనిపించనున్నారు.

ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరమ్, ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. మూవీ థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి వారాల తర్వాత ఓటీటీలోకి మూవీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. 

Also Read : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత