Sachin Tendulkar Documentary Billion Dreams OTT Streaming : గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ జీవితం, స్పోర్ట్స్ జర్నీ ఆధారంగా రూపొందించిన ఇన్‌స్పిరేషనల్ డాక్యుమెంటరీ 'సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్'. 2017లో రిలీజైన ఈ డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్‌గా సచిన్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. 

Continues below advertisement

జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో సచిన్ ఇన్‌స్పిరేషనల్ జర్నీతో పాటు 2011లో ఇండియా వరల్డ్ కప్ సాధించిన మూమెంట్, క్రికెట్ గాడ్ స్పీచ్, రేర్ హోమ్ వీడియోస్, మ్యాచ్ ఫుటేజ్‌తో పాటు ఇండియన్ క్రికెట్ హిస్టరీలో కీలక ఘట్టాలను చూపించారు. అప్పట్లో ఈ డాక్యుమెంటరీ ఓ సెన్సేషన్.

9 ఏళ్ల తర్వాత...

Continues below advertisement

దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈ డాక్యుమెంటరీ ఓటీటీలో రాబోతోంది. 'ఓ డ్రీమ్, బ్యాట్, యావత్ ప్రపంచాన్ని ఉత్తేజపరిచిన జర్నీ. క్రికెట్‌కు దేవుడిగా మారిన ఓ వ్యక్తి కథ. సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్ త్వరలోనే మీ ముందుకు రాబోతోంది.' అంటూ ఆహా అఫీషియల్‌గా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ నెల 29 నుంచి తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఈ డాక్యుమెంటరీలో సచిన్ భార్య అంజలి డెండూల్కర్, సోదరుడు అజిత్ టెండూల్కర్ ఎమోషనల్ మూమెంట్స్‌తో పాటు మిస్టర్ కూల్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కనిపిస్తారు. ఎక్కువ భాగం సచిన్ లైఫ్‌లోని రియల్ ఫుటేజీనే ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీని 200 నాట్ అవుట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవి భగచంద, శ్రీకాంత్ భాసి నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. 

Also Read : కిరణ్ అబ్బవరం సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్ - ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే