NTR Pays Tribute To Nandamuri Taraka Ramarao : టీడీపీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆయనకు నివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు గురువారం ఉదయం 6 గంటలకు చేరుకున్న ఆయన... తాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నేలపై నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేశారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కింద పడ్డ ఫ్యాన్... ఎన్టీఆర్ ఏం చేశారంటే?
జూనియర్ ఎన్టీఆర్ రావడంతో ఫ్యాన్స్ ఘాట్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఎన్టీఆర్‌కు చెయ్యి ఇవ్వబోయి కింద పడ్డాడు. భద్రతా సిబ్బంది అతన్ని పక్కకు లాగేసేందుకు యత్నించగా ఎనీఆర్ సదరు అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు కూడా ఘాట్ వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Also Read : సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
