Dhruv Vikram's Bison Movie OTT Streaming : తమిళ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ రీసెంట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బైసన్'. అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంలో వారం ముందే రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
5 భాషల్లో స్ట్రీమింగ్
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 'ఈ బైసన్ కీర్తి, ధైర్యం చూసే సమయం ఇది.' అని క్యాప్షన్ ఇస్తూ ఓ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.
ఈ మూవీలో ధ్రువ్ విక్రమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా... రెజిషా విజయన్, కలైయరసన్, పశుపతి, హరికృష్ణన్, అరువి మదన్, అళగమ్ పెరుమాళ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఫేమస్ డైరెక్టర్ పా రంజిత్ సమర్పణలో ఈ మూవీని రూపొందించారు.
Also Read : షాకింగ్... కొత్తగా ఆ సైట్‌లో iBOMMA పైరసీ మూవీస్! - నిందితుడు రవి అలా ప్లాన్ చేశాడా?
స్టోరీ ఏంటంటే?
కబడ్డీ ప్లేయర్ కావాలనుకునే ఓ పల్లెటూరి కుర్రాడి కథ బైసన్. 1990 టైంలో కబడ్డీ బ్యాక్ డ్రాప్‌గా సాగే స్టోరీ ఇది. తమిళనాడు మారుమూల గ్రామం. అందులో తన ఫ్యామిలీతో పాటు ఉండే కిట్టన్ (ధ్రువ్ విక్రమ్)కు కబడ్డీ అంటే ప్రాణం. అయితే, ఊరిలో కుటుంబ కక్షలతో సొంత కులం వాళ్లే అతన్ని దూరం పెడుతూ కబడ్డీ టీంలోకి తీసుకోరు. అయితే, అతని టాలెంట్ గుర్తించి ఆ ఊరి స్కూల్ పీఈటీ కిట్టన్‌కు ట్రైనింగ్ ఇస్తాడు.
అలా తన ప్రతిభతో 12 ఆసియా క్రీడలకు ఎంపికవుతాడు కిట్టన్. అయితే, జాతీయ జట్టుకు ఎంపికైనా అతనికి మైదానంలో ఆడే ఛాన్స్ దొరకదు. కేవలం బెంచ్‌కే పరిమితం అవుతాడు. దీంతో కిట్టన్ తీవ్ర నిరాశకు గురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జాతీయ స్థాయి వరకూ కిట్టన్ ఎలా చేరుకున్నాడు? కిట్టన్‌కు అతని ఫ్యామిలీ నుంచి ఎలాంటి సహకారం లభించింది? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.