iBOMMA Piracy Movies Placed In Term Insurance Website : iBOMMA నిర్వాహకుడు రవి అరెస్టుతో పైరసీ ఆగిపోతుందని ఇండస్ట్రీ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, 'iBOMMA One' పేరిట మరో వెబ్ సైట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. దాన్ని క్లిక్ చేస్తే మూవీ రూల్జ్‌కు రీడైరెక్ట్ అవుతుందంటూ ప్రచారం సాగింది. అయితే, అందులో కేవలం మూవీస్ రివ్యూస్ మాత్రమే ఉన్నాయని... iBOMMA, BAPPAM సైట్స్ పూర్తిగా క్లోజ్ చేశామని పోలీసులు అనౌన్స్ చేశారు.

Continues below advertisement

షాకింగ్... ఫేమస్ ఇన్సూరెన్స్ సైట్‌ పేరిట...

అయితే, ఇండస్ట్రీని మాత్రం ఈ పైరసీ భూతం ఇప్పుడే వదలడం లేదు. నెట్టింట పైరసీ మూవీస్ ఆగడం లేదు. ఇందుకు బలం చేకూర్చేలా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ టెర్మ్ ఇన్సూరెన్స్ వెబ్ సైట్‌ పేరిట క్రియేట్ చేసిన ఫేక్ సైట్‌లో పైరసీ మూవీస్ వస్తున్నట్లు తెలుస్తోంది. 'iBOMMA, BAPPAM క్లోజ్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ iBOMMA రవి... SBI టెర్మ్ ల్యాప్స్ పేరిట ఓ పోర్టల్ క్రియేట్ చేసి అందులో కొత్త మూవీస్ లింక్స్ పెట్టాడు.' అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

అయితే, అది నిజమైన SBI ఇన్సూరెన్స్ సైట్ కాదు. ఫేమస్ ఇన్సూరెన్స్ వెబ్ సైట్ పేరిట ఓ ఫేక్ సైట్ క్రియేట్ చేసి అందులో ఈ మూవీస్ పైరసీ లింక్స్ పెట్టినట్లు తెలుస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు కొందరు రవి టాలెంటెడ్ అంటూ మెచ్చుకుంటుంటే మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 'కొందరు వాట్ ఏ టాలెంట్ రవి అన్నా' అంటూ కామెంట్స్ చేస్తుండగా... మరికొందరు నమ్మకమైన ఓ ఇన్సూరెన్స్ సైట్ పేరిట ఇలా ఫేక్ సైట్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. అలాంటి ఫేక్ సైట్‌లో మూవీస్ పెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ - GHMC నోటీసులు... అసలు రీజన్ ఏంటంటే?

కొత్తగా 'iBOMMA Plus'...

iBOMMA, BAPPAM క్లోజ్ అయినా కూడా రోజుకో కొత్త సైట్లలో పైరసీ మూవీస్ దర్శనమిస్తూనే ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని పైరసీ సైట్లు 'iBOMMA' పేరును వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సైట్లకు ఆ పేరు మారుస్తున్నట్లు సమాచారం. అక్కడ క్లిక్ చేస్తే రీ డైరెక్ట్ అయ్యేలా వెబ్ సైట్స్ డిజైన్ చేశారు. iBOMMA Plus సైట్ క్లిక్ చేస్తే 'మూవీ రూల్జ్'కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

రోజుకో కొత్త రీతిన పుట్టుకొస్తున్న పైరసీ సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మూవీ లవర్స్, ఇండస్ట్రీ పెద్దలు కోరుతున్నారు. నిన్న 'iBOMMA One', నేడు 'iBOMMA Plus' వచ్చిందని... ఏకంగా ఫేక్ ఇన్సూరెన్స్ వెబ్ సైట్‌లోనే మూవీస్ ప్రత్యక్షం అవుతున్నాయని... వీటికి చెక్ పెట్టాలని కోరుతున్నారు.

నిందితుడు రవిపై మరిన్ని సెక్షన్లు

మరోవైపు, అధికారులు నిందితుడు రవిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఫస్ట్ డే విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించాడు. రెండో రోజు విచారణలోనూ పైరసీకి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే అతనిపై IT యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్, BNS సెక్షన్స్ నమోదు చేసిన పోలీసులు తాజాగా ఫోర్జరీతో పాటు మరో 2 సెక్షన్లను జోడించారు. అటు, రవి తరఫున కోడి కత్తి లాయర్ సలీం ఫ్రీగా వాదించేందుకు సిద్ధం కాగా... కేసుకు సంబంధించిన పేపర్లపై రవి తండ్రి సంతకం చేయనని చెప్పినట్లు తెలుస్తోంది.