బర్డ్ బాక్స్(Bird Box).. 2018లో విడుదలైన పోస్ట్ అపోకలిప్టిక్ కాన్సెప్ట్ తో వచ్చిన హార్రర్ థ్రిల్లర్. అనుక్షణం ప్రాణాలను కాపాడుకోవటం కోసం కేవలం సర్వైవల్ ఒక్కటే లక్ష్యంగా పరిగెడుతున్న దృశ్యాల్ని చూస్తే, జీవితం విలువ తెలుస్తూ ఉంటుంది. అందుకని, ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడూ చూస్తుండాలి. మనకున్న ప్రతిదీ ఒక బ్లెస్సింగ్ లా కనపడుతుంది. బతకటానికి ధైర్యం వస్తుంది. 


‘బర్డ్ బాక్స్’ కథ విషయానికి వస్తే, మలోరీ తన ఇద్దరు పిల్లల్ని బోట్‌లో తీసుకెళ్తూ, వాళ్ళ కళ్లకున్న గంతలు అస్సలు తీయొద్దు. ఒకవేళ తీస్తే చచ్చిపోతారు అని గట్టిగా చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఐదు సంవత్సరాల క్రితం మలోరీ ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు, తన చెల్లి జెస్సికా చూడటానికి వస్తుంది. చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ ఒక పేషెంట్ హాస్పిటల్ కిటికీకి తల బాదుకొని చచ్చిపోవటం మలోరీ చూస్తుంది. అక్కడందరూ సూసైడల్ టెండెన్సీతో ప్రవర్తిస్తారు. తిరిగి వెళ్లేటపుడు మలోరీ చెల్లెలు జెస్సికా ఏదో చూసి కార్ ఆపి, ఒక లారీకి అడ్డుగా వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది. అది చూసి మలోరీ ప్రాణభయంతో పరిగెడుతుంది.


ఒక ఇంటి ఓనర్ వచ్చి మలోరీ కడుపుతో ఉండటం చూసి ఆమెను లోపలికి పిలుస్తుంది. ఆ ఓనర్ ఏదో చూసి ట్రాన్స్ లోకి వెళ్లిపోయి, కాలిపోతున్న కారులో కూర్చొని చచ్చిపోతుంది. అప్పుడు హీరో టామ్ వచ్చి మలోరీని తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో ఇంకో ఆరుగురు వేర్వేరు కల్చర్స్ కి చెందినవారు షెల్టర్ పొందుతుంటారు. అందులో చార్లీ అనే వ్యక్తి, హ్యూమానిటీ చచ్చిపోయిందనటానికి అందర్నీ చంపేసే ఈ ప్రాణులే సూచన. యుగాంతం జరగబోతుందని అర్థం అని చెప్తాడు. బయటకు వెళ్ళేటపుడు కచ్చితంగా అందరూ కళ్లకు గంతలు కట్టుకోవాలని చెప్పుకుంటారు. ఆ వింత క్రియేచర్స్‌ను కెమెరాలో చూడోచ్చా? అని టెస్ట్ చేసిన ముగ్గురూ కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు.


గ్రూప్లో మిగిలిన వ్యక్తులు ఫుడ్ కోసం స్టోర్‌కు వెళ్తారు. GPS నావిగేషన్ సిస్టం ద్వారా కారును కవర్ చేసుకొని వెళ్తారు. మలోరీ తనతో పాటు తన పెంపుడు పక్షులు మూడింటిని తీసుకొస్తుంది. ఆ వింత ప్రాణులు ఈ పక్షులకు చిరాకు కలిగిస్తున్నట్లు ఆమె గమనిస్తుంది. ఇంతలో చార్లీతో పనిచేసే వ్యక్తి ఈ గ్రూపులో వారందర్నీ ఆ వింత క్రియేచర్స్‌ను చూసేలా బలవంతపెడుతాడు. మిగిలిన వారందర్నీ కాపాడటం కోసం చార్లీ ప్రాణత్యాగం చేస్తాడు. మిగిలిన వారందరూ ఇంటికి వెళ్లిపోతారు. ఒకరోజు గ్యారీ అనే వ్యక్తిని ఇంట్లో వారికి ఇష్టం లేకున్నా గ్రూపులో ఒకామె ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఆ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా అక్కడ కొందరి కళ్లు బలవంతంగా తెరిచి, వాళ్లు సూసైడ్ చేసుకునేలా చేస్తాడు. 


అసలు ఆ ప్రాణులు మనుషుల్ని ఎందుకు చంపుతాయి.. కొందరు వ్యక్తులు వాటికి సపోర్ట్ గా ఎందుకు పనిచేస్తున్నారు? ఆ ప్రాణుల్ని చూసినపుడు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల మనుషుల లోపల ఏమైనా జరుగుతోందా? సైకోపాథ్ వ్యక్తులకు మాత్రం దీనివల్ల ఏ నష్టం జరగకుండా ఉంటోందా? ఇవన్నీ ప్రశ్నలు మిస్టీరియస్ గానే ఉండిపోతాయి. ఇవి ఆలోచించుకోవటానికి ప్రేక్షకులకే వదిలేస్తుంది డైరెక్టర్ సుసానే బీర్.


గ్యారీతో ఘోరమైన గన్ ఫైట్ లో భాగంగా టామ్ ఆ వింత ప్రాణుల్ని చూసి, తనను తాను గన్ తో కాల్చుకోవాల్సి వస్తుంది. ఇలా రకరకాల మలుపులు తిరిగిన తర్వాత మలోరీ తన పిల్లల్ని కాపాడుకోవటానికి ఎంత కష్టపడుతుంది? చివరికి వారిని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆమె తీసుకెళ్లిన ప్రదేశంలో మాత్రమే వాళ్లు సేఫ్ గా ఉండగలరన్న నమ్మకం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సూసైడల్ కాంటెంట్, భయంకరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉండటం వల్ల సెన్సిటివ్ వ్యక్తులు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది. నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చింది. కాబట్టి.. రెండూ చూసేయండి.



Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు