బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ కుమారుడు జూనియర్ బచ్చన్ అభిషేక్ (Abhishek Bachchan) సింగిల్ పేరెంట్ పాత్రలోకి వచ్చేశారు. అమ్మాయితో కలిసి 'బీ హ్యాపీ' అంటున్నారు. ముంబై మీడియా వర్గాలలో కొన్ని రోజుల నుంచి ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ నుంచి అభిషేక్ విడాకులు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయని గుసగుసలు చాలా వినిపించాయి. ఇప్పుడు ఈ సింగిల్ పేరెంట్ పాత్రకు, ఆయన జీవితానికి సంబంధం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే...
అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'బీ హ్యాపీ'
అభిషేక్ బచ్చన్ సింగల్ పేరెంట్ పాత్రలోకి వచ్చినది ఒక ఓటీటీ ప్రాజెక్ట్ కోసం. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా 'బీ హ్యాపీ' (Be Happy Hindi Movie). ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video OTT) కోసం తీస్తున్న చిత్రమిది. ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా శనివారం సెప్టెంబర్ 21వ తేదీన ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు.
Also Read: ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు... లడ్డూ వివాదంలో సెటైరికల్ ట్విట్టర్ యుద్ధం
అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించినది ఎవరో తెలుసా?
'బీ హ్యాపీ' సినిమాలో అభిషేక్ బచ్చన్ కుమార్తె పాత్రలో ఇనాయత్ వర్మ (Inayat Verma) నటించారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇద్దరూ ఉన్నారు. ఆ స్టిల్ చూస్తే ఇద్దరు ఓ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అమ్మాయి కలను సాకారం చేయడం కోసం ఓ తండ్రి ఏం చేశాడు? అనేది 'బీ హ్యాపీ' స్టోరీ లైన్ అని ప్రైమ్ వీడియో వర్గాలు చెప్పాయి. ఇండియాలో అతి పెద్ద డాన్స్ రియాలిటీ షో నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. రియాల్టీ షోలో తండ్రి కూతురు ఏ విధమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు అనేది డిజిటల్ స్క్రీన్ మీద చూడాలి.
Also Read: చంద్రబాబుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ థాంక్స్... నాగవంశీలా తప్పు చేయలేదు!
రెమో డిసౌజ దర్శకత్వంలో 'బీ హ్యాపీ' 'బీ హ్యాపీ' చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా (Remo D'souza) దర్శకత్వం వహించారు. డాన్స్ నేపథ్యంలో సినిమాలు తీసిన అనుభవం ఆయనకు ఉంది. 'ఏబిసిడి - ఎనీ బడీ కెన్ డాన్స్', 'ఏబిసిడి 2'తో పాటు 'స్ట్రీట్ డాన్సర్' చిత్రాలకు రెమో డిసౌజా దర్శకుడు. సల్మాన్ ఖాన్ నటించిన 'రేస్ 3'కి కూడా ఆయన దర్శకత్వం వహించారు. 'బీ హ్యాపీ'లో ఆయన ఎటువంటి ఎమోషన్ చూపిస్తారో చూడాలి. ఈ సినిమా కథలోని తండ్రి కుమార్తెల అనుబంధం ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటుందని రెమో డిసౌజా వివరించారు. ఇందులో నోరా ఫతేహి కీలక పాత్ర చేశారు.