Zee5 Original Web Series Bahishkarana Release Date Announced: పక్కింటి అమ్మాయిగానూ, పవర్ ఫుల్ పాత్రల్లోనూ నటించగల ప్రతిభ తెలుగమ్మాయి అంజలి సొంతం. ఇప్పుడు మరొక పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జీ5 ఓటీటీ కోసం రూపొందిన ఒరిజినల్ వెబ్ సిరీస్ 'బహిష్కరణ'లో ఆవిడ వేశ్య పాత్ర పోషించారు. ఇవాళ ఆ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.  






జూలై 19 నుంచి జీ5లో 'బహిష్కరణ' స్ట్రీమింగ్‌
గ్రామీణ నేపథ్యంలో 'బహిష్కరణ' వెబ్ సిరీస్ రూపొందింది. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌ షో ఇది. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. జీ5 ఓటీటీ సంస్థతో కలిసి పిక్సెల్ పిక్చర్స్ ఇండియా పతాకం దర్శకుడు ముఖేష్ ప్రజాపతి తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.


Also Readఈటీవీ విన్ ఓటీటీ కోసం నిర్మాతగా మారుతున్న దర్శకుడు... యేలేటి నుంచి వెబ్ సిరీస్, ట్విస్ట్ ఏమిటంటే?



అంజలి మాట్లాడుతూ... ''పుష్ప పాత్రలో నటించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆ పాత్రలో నటించడం ఎంతో సంతృప్తి కలిగింది. ఓ అమాయకపు వేశ్య నుంచి ధైర్యవంతురాలుగా పుష్ప ఎలా ఎదిగింది? ఆమె ప్రయాణం ఏమిటి? అనేది దర్శకుడు చక్కగా చూపించారు. Bahishkarana Web Seriesలో పుష్ప ప్రయాణం ఆసక్తిగా ఉంటుంది. ఆమె జీవితం, ఆమె కథ ఓ మిస్టరీ. జీ5 ఓటీటీలో అందరూ ఈ సిరీస్ చూడాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. వెబ్ సిరీస్ నిర్మాత, పిక్సెల్ పిక్చర్స్ అధినేత ప్రశాంతి మలిశెట్టి మాట్లాడుతూ... ''ప్రముఖ ఓటీటీ వేదిక జీ5తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన మద్దతుతో స్థానిక కథలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చెరువ అయ్యేలా చెప్పగలం అనే నమ్మకం మాకు కలిగింది'' అని చెప్పారు.


Also Readఅల్లు హీరోతో నటించిన ఈ అందాల భామ ఎవరు, ఇంతకు ముందు ఏం చేసిందో తెలుసా?



'బహిష్కరణ' గురించి దర్శకుడు ముఖేష్ ప్రజాపతి మాట్లాడుతూ... ''ఇందులో కథ, కథనాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ప్రేక్షకుల్ని అబ్బుర పరుస్తాయి. ప్రతి పాత్ర బావుంటుంది. లోతైన, సంక్లిష్టమైన భావోద్వేగాలు ఉన్నాయి. కోల్పోవడానికి ఏమీ లేని, జీవితం అంటేనే ఇంత అన్యాయంగా ఉంటుందని పుష్ప (అంజలి) భవిస్తూ ఉంటుంది. సముద్రం అంత ప్రశాంతంగా ఉండే వ్యక్తి జోలికి ఎవరైనా వస్తే... ఎంత వినాశనం జరుగుతుంది? ఎటువంటి పరిస్థితులు ఎదురు అవుతాయి? అనేది మేం చూపించాం. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఏం జరిగినా పుష్ప ధైర్యంగా అడుగు ముందుకు వేసి తన ప్రతీకారం తీర్చుకుంటుంది. అంజలి తనదైన నటనతో పుష్ప పాత్రకు ప్రాణం పోశారు. ప్రేక్షకులు అందరికీ ఈ సిరీస్ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.


Bahishkarana Web Series Cast And Crew: అంజలి ప్రధాన పాత్రలో నటించిన 'బహిష్కరణ'లో రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, అనన్యా నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, 'బేబీ' చైత్ర ముఖ్య తారాగణం. ఈ సిరీస్ కూర్పు: రవితేజ గిరిజాల, కాస్ట్యూమ్ డిజైనర్: అనూష పుంజాల, సహ రచయిత: వంశీ కృష్ణ పొడపాటి, మాటలు: శ్యామ్ చెన్ను, ఛాయాగ్రహణం: ప్రసన్న కుమార్, సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని,నిర్మాణ సంస్థ: పిక్సెల్ పిక్చర్స్ ఇండియా, నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి, రచన - దర్శకత్వం: ముఖేష్ ప్రజాపతి.