Sharwanand Manamey Movie OTT Release and Stream Date Details: ప్రామిసింగ్ హీరో శర్వానంద్, 'ఉప్పెన' బ్యూటీ కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా తెరెక్కిన రీసెంట్‌ మూవీ 'మనమే'. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ విక్రమాదిత్య కీలక పాత్రలో నటించాు. శర్వానంద్‌ 35వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జూ్‌ 7న థియేటర్లో రిలీజ్‌ అయ్యింది. రిలీజ్‌ తర్వాత మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత థియేట్రికల్‌ రన్‌లో మంచి వసూళ్లు చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.


కానీ, అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించకలేకపోయింది. ఇక టాక్‌కు భిన్నంగా బాక్సాఫీసు వద్ద మనమే లాభాలు తెచ్చిపెట్టింది. వరుస ప్లాప్స్‌ తర్వాత శర్వానంద్‌, కృతీలకు మనమేతో మంచి హిట్‌ పడింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కి రెడీ అయ్యింది. ఈ మూవీ విడుదలైన నెల రోజులు దాటింది. ఈ క్రమంలో మనమే ఓటీటీ కోసం సినీ ప్రియులంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మనమే ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మనమే ఓటీటీ హక్కులను ప్రము డిజిటల్‌ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుందట. భారీ ధరకే మనమే ఓటీటీ రైట్స్‌ అమ్ముడైనట్టు తెలుస్తోంది.


ఇక ఈ సినిమా థియేట్రికల్‌ రన్‌ ముగియడంతో ఇక ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జూలై 12 నుంచి మనమేను ఓటీటీలో అందుబాటులోక తీసుకురాబోతున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక సమచారం లేదు. కానీ, త్వరలోనే మనమే ఓటీటీ రిలీజ్‌పై హాట్‌స్టార్‌  అధికారిక ప్రకటన ఇవ్వనుందని సమాచారం. మనమే సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీ బాగుంది. ముఖ్యంగా శర్వానంద్‌, కృతీ శెట్టి యాక్టింగ్‌ సినిమాకు ప్లస్‌ అని చెప్పాలి. కానీ రోటిన్‌గా ఉన్న కథనం ఈ సినిమా మైనస్‌ అయ్యిందని ఆడియన్స్‌ నుంచి రివ్యూస్‌ వచ్చాయి. 


'మనమే' కథ విషయానికి వస్తే


ఎలాంటి ఎమోషన్స్‌, బాధ్యతలు లేని విక్రమ్ (శర్వానంద్) ఫారిన్‌లో నివసిస్తుంటాడు. లండన్‌లో తనకు నచ్చినట్టు  తిరుగుతూ.. అమ్మాయిల వెంట పడుతూ ప్లే బాయ్‌లా ఉంటాడు. విక్రమ్ స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్), శాంతి (మౌనికా రెడ్డి) దంపతులు ఇండియా వెళతారు. అక్కడ ఒక ప్రమాదంలో వాళ్లిద్దరూ మరణించగా వారి కుమారుడు ఖుషి (విక్రమ్ ఆదిత్య) ఒంటరి అవుతాడు. అనురాగ్ అనాథ, అతడిని ప్రేమించి ఇంట్లోని వాళ్లని కాదని పెళ్లి చేసుకుంటుంద. దీంతో పిల్లాడి బాధ్యత తీసుకునేందుకు మౌనిక తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో ఆమె స్నేహితురాలు సుభద్ర (కృతి శెట్టి)తో పిల్లాడిని దత్తత తీసుకోవాలనుకుంటుంది.



కానీ ఆమె అప్పటికే పెళ్లి కానందున ఇందుకు ప్రభుత్వం నిరాకిస్తుంది. దీంతో పిల్లాడి కోసం శర్వానంద్‌తో కలిసి ఉండేందుకు ఒప్పుకుంటుంది. వీరిద్దరు కలిసి విక్రమ్ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. బంధాలకు, బాధ్యతలు తెలిసి సుభద్ర, అసలు రిలేషన్‌ షిష్ప్‌ అంటేనే పడిని విక్రమ్‌.. వీరిద్దరు కలిసి పిల్లాడి బాధ్యత తీసుకోవడమే అక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. మరి ఈ జర్నీలో వారిద్దరు ఎదుర్కొన్న పరిణామాలు, వేరు వేరు మనస్తత్వాలు ఉన్న వీరిద్దరు ఎలా కలిశారన్నదే 'మనమే' కథ.


Also Read: బాక్సాఫీసు వద్ద 'కల్కి 2898 AD' ప్రభంజనం - ఏడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..