Chiranjeevi Special Birthday Wishes to MM Keeravani: సంగీత స్వరకర్త, ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్ కీరవాణి బర్త్‌డే నేడు(జూన్ 4). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువెత్తున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఈ 'మరకతమణి'కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా కీరవాణి స్పెషల్ వీడియో షేర్ చేశారు. కాగా ప్రస్తుతం కీరవాణి చిరంజీవి 'విశ్వంభర' మూవీకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు ఇంట్లోనే సంగీత కచేరి పెట్టి విశ్వంభర పాటలకు ట్యూన్ కట్టారు కీరవాణి.
ఈ వీడియోను చిరు షేర్ చేస్తూ... "ఈ రోజే జన్మించిన మా 'ఆస్కారుడు' ఎం.ఎం. కీరవాణి గారికి నా హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు!" తెలిపారు. ఇక ఆయన వాయిస్‌తో సాగిన ఈ వీడియోలో చిరు నాటి రోజులను గుర్తు చేశారు. ఒకప్పుడు ఒకప్పుడు అందరు ఒకచోట చేరి సంగీత దర్శకుడి ఊహాల్లో నుంచి ప్రవహిస్తూ పాడేవి బాగున్నాయో లేవో చర్చించిన తర్వాతే ఆ పాట బయటకు వచ్చేది. మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ మళ్లీ కీరవాణి గారు విశ్వంభర కోసం మ్యూజిక్ కంపోజ్ చేసే ప్రక్రియను మా ఇంట్లో ఏర్పాటు చేశారు.
అది జరుగుతున్న సందర్భంలో నాకు పాత రోజులు గుర్తు వచ్చాయి. ఆపత్బాంధవుడు మ్యూజిక్ కంపోజ్ చేసినప్పటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నాటి మధుర గీతాన్ని ఆయన ఆలపిస్తుంటే మనసు తియ్యగా అనిపించింది. ఆ అనుభూతిని ఈ సందర్భంగా మీతో పంచకోవాలని అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే 'విశ్వంభర' మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు టాకీ పార్ట్‌ని కూడా జరుపుకుంటుంది.
తాజాగా డబ్బింగ్ వర్క్‌ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా విశ్వంభర మూవీ రూపొందుతుంది. చిరు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో విక్రమ, ప్రమోద్‌లు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన త్రిష హీరోయిన్ నటిస్తుంది. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. బింబిసార వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇది. ఈ చిత్రం కోసం అతడు ఓ కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేస్తున్నట్టు ఈ మూవీ కాన్సెప్ట్ వీడియో అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: సంగీత స్వరకర్త, ఆస్కార్ విజేత కీరవాణి బర్త్‌డే - మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?