Kalki 2898 AD 7 Days Collecions: డబుల్‌ సెంచరికి చేరువలో కలెక్షన్స్‌ రాబట్టిన ఈ సినిమా వీకెండ్‌ వరకు కల్కి అదే జోరు కనబరించింది. ప్రతి రోజు రూ. 100 కోట్లు వసూళ్లు చేస్తూ రికార్డు సృష్టిస్తుంది. వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంద. ఇక సెకండ్‌ వీక్‌లో కాస్తా డ్రాప్‌ కనిపించిన కలెక్షన్స్‌ మాత్ర పర్వేలేదు అనిపించాయి. వరుసగా ఆరు రోజులు ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి దూకుడు చూపించింది. ఫలితంగా ఆరు రోజుల్లోనే కల్కి రూ. 680కి పైగా కోట్ల గ్రాస్‌ చేసింది. ఇక ఏడవ రోజు కూడా అదే జోరు చూపిస్తుందనుకుంటే కలెక్షన్స్‌లో భారీగానే డ్రాప్‌ కనిపించింది.


'కల్కి' ఏడవ రోజు కలెక్షన్స్‌


అయినా కూడా కల్కి వారంలో రోజుల్లో ఫ్యాన్సీ నెంబర్‌కు చేరుకుంది. ఏడో రోజు వచ్చిన కలెక్షన్స్‌తో కలిపి కల్కి 2898 AD వరల్డ్‌ వైడ్‌గా రూ. 700 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మూవీ టీం ప్రకటించింది. ఏడో రోజుతో కల్కి రూ.700 కోట్ల గ్రాస్‌ మార్క్‌ చేరినట్టు వైజయంతీ మూవీస్‌ వెల్లడించింది. ఇక కల్కి ఇండియాలోనే ఓవర్సిస్‌లోనూ రికార్డులు సెట్‌ చేస్తుంది. అక్కడ భారీగా కలెక్షన్స్‌ చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఓవర్సిస్‌లో ఇప్పటి వరకు ఏ మూవీకి రానీ కలెక్షన్స్‌ను కల్కి రాబట్టింది. నార్త్‌ అమెరికాలో కల్కి ఆరు రోజుల్లో రూ.12.8 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసినట్టు సమాచారం.






ఓవర్సిలో రికార్డ్స్ బ్రేక్ చేస్తూ..


ఇలా ఓవర్సిస్‌లోనూ కల్కి సునామీ కలెక్షన్స్‌ రాబడుతుంది. ఇప్పటికీ నార్త్‌ ఆమెరికాలో ఈ చిత్రం అదే జోరు చూపిస్తుందట. ఇక యూకే ఇతర దేశాల్లోనూ కల్కి భారీగానే కలెక్షన్స్‌ రాబట్టింది. మొత్తానికి ప్రభాస్‌ కల్కితో మరోసారి బాక్సాఫీసు రారాజు అని నిరూపించాడు. కాగా నాగ్‌ అశ్విన్‌ కల్కితో వెండితెరపై అద్భుతం చేశాడనే చెప్పాలి. సోషియా ఫాంటసి జానర్‌కి మహాభారతం జోడించి అడ్వాన్స్‌ టెక్నాలజీతో విజువల్‌ వండర్‌ కల్కిని రూపొందించాడు. మూడు ప్రపంచాల మధ్య కల్కిని నడుపుతూ అద్భతం చేశాడు. దీంతో నాగ్‌ అశ్విన్‌కి విజన్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.



సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కల్కి నాగ్‌ అశ్విన్‌ అద్భుత సృష్టి అంటూ అతడిని కొనియాడుతున్నారు. కాగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు అశ్వినీ దత్‌ నిర్మాతగ వ్యవహరించారు. ఇందులో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, కమల్‌ హాసన్‌, సీనియర్‌ నటి శోభన, రాజేంద్ర ప్రసాద్‌ వంటి భారీ తారగణం కల్కిలో భాగం అయ్యారు. ఇక దుల్కర్‌ సల్మాన్‌, ఎస్‌ఎస్‌ రాజమౌళి, రామ్‌ గోపాల్‌ వర్మ వంటి దిగ్గజాలు గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వడం సినిమాకు మరింత ఆకర్షణ. కాగా కల్కిని రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్టు సమాచారం. 


Also Read: ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో కమల్ హాసన్ లుక్ ఇదేనా? ఈ వైరల్ ఫొటోల వెనుక అసలు కథ ఇదీ!