Amazon Prime Video Web Serie Sequels: ఇండియాలో నెంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ గా గుర్తింపు తెచ్చుకుంది డిస్నీ+ హాట్ స్టార్. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ తో పోల్చితే ప్రేక్షక ఆదరణ విషయంలో హాట్ స్టార్ అందనంత ముందు దూసుకెళ్తోంది. ప్రేక్షకులు వీక్షించే కంటెట్ సగానికి పైగా ఈ సంస్థ నుంచే ఉండటం విశేషం. హాట్ స్టార్ తో పోటీ పడుతున్న అమెజాన్ ప్రైమ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కంటెంట్ ను అందిస్తోంది. ప్రైమ్ వీడియోకు సంబంధించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘మీర్జాపూర్’, ‘పంచాయత్’ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలు ప్రైమ్ కు ఫ్లాగ్ షిప్ లుగా మారాయి. అంతేకాదు, సబ్ స్క్రైబర్లను గణనీయంగా పెంచుకోవడంలో ఉపయోగపడ్డాయి.
బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ లకు సీక్వెల్స్
ఇదే జోష్‌లో మరింత ప్రేక్షకాదరణ పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించడానికి బ్లాక్ బస్టర్ సిరీస్ లకు సంబంధించిన సీక్వెల్స్ ను ప్రకటించింది. వీటిలో నాగ చైతన్య నటించిన ‘ధూత 2’తో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’, ‘మీర్జాపూర్ 3’, ‘పంచాయత్ 3’, ‘పాటల్ లోక్ 2’ లాంటి సిరీస్ లు ఉన్నాయి. అటు వరుణ్ ధావన్, సమంతా కలిసి నటిస్తున్న ‘సిటాడెల్ ఇండియా’ కూడా తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌కు దిగ్గజ దర్శకులు రాజ్ - డికె దర్శకత్వం వహించారు. వీటితో పాటు ‘కాల్ మి బే’, ‘పార్ట్ నర్స్’, ‘సూపర్‌మెన్ ఆఫ్ మాలెగావ్’, ‘స్టార్ డమ్’, ‘చోరీ2’, ‘ఖౌఫ్’, ‘జుంటా బ్యాండ్’, ‘నోటోరియస్ గర్ల్స్’, ‘గుల్కంద టేల్స్’, ‘బండిష్ బండిట్స్ 2’తో పాటు సుమారు 40కి పైగా సిరీస్ లను అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈ సిరీస్ ల ద్వారా భారత్ తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. డిస్నీ + హాట్ స్టార్ కు దీటుగా సబ్ స్క్రైబర్లను పంచుకోవాలని భావిస్తోంది.
నాగ చైతన్య చెప్పిన సర్ ప్రైజ్ ఇదేనా?
గత ఏడాది డిసెంబర్ 1న ‘ధూత’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అప్పట్లో అమెజాన్ లో ట్రెండింగ్ లో నిలిచింది. విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ టాప్ వెబ్ సిరీస్ ల లిస్టులో ‘ధూత’ ఒకటిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మార్చి 19న ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. తాజాగా అమెజాన్ ‘ధూత 2’ గురించి అఫీషియల్ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆయన చెప్తానన్న సర్ ప్రైజ్ ఇదే అంటున్నారు అభిమానులు. ‘ధూత’ వెబ్ సిరీస్ ను విక్రమ్ కే కుమార్ తెరకెక్కించారు.
Read Also: హై యాక్షన్‌లో జాన్ అబ్రహం, అమాయక పాత్రలో తమన్నా- ఆకట్టుకుంటున్న ‘వేదా‘ టీజర్