ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయాన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓటీటీలో కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. ప్రతి శుక్రవారం సినిమాలు, సిరీస్ లు, షోలు కలిపి పదుల సంఖ్యలో రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు కూడా ఏకంగా 10కి పైగా సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే తెలుగులో ఉన్నాయి.   


ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్  
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన మూవీ 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. ముఖ్యంగా చాలా ఏళ్ల తరువాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో సత్తాచాటి భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈ సినిమా జనవరి 3వ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ముంబై నర్సింగ్ హోమ్‌లో పని చేసే ఇద్దరు కేరళ నర్సుల కథ ఆధారంగా రూపొందింది. ఇందులో కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో నటించారు. 


లవ్ రెడ్డి
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి లీడ్ రోల్స్ పోషించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'లవ్ రెడ్డి'. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్  బ్యానర్లపై ఈ సినిమాను  నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ప్రేమకథను స్మరన్ రెడ్డి రూపొందించారు. ఆయనకు డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా. అక్టోబర్ 18 న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథ జనవరి 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. 


అన్ స్టాపబుల్ సీజన్ 4 
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'అన్ స్టాపబుల్ సీజన్ 4'. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో బాలయ్య హీరోగా నటించిన 'డాకు మహారాజ్' టీం సందడి చేసిన ఎపిసోడ్ జనవరి 3న వచ్చేసింది. 


ది రానా దగ్గుబాటి షో 
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'ది రానా దగ్గుబాటి'. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈరోజు స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్ లో ఉపేంద్ర, ఫరియా, నవదీప్ సందడి చేయనున్నారు. 



జనవరి 3 - గుణ సీజన్ 2 (హిందీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్) -అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
జనవరి 3 - ఐ వాంట్ టు టాక్ (హిందీ సినిమా) - అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
జనవరి 3 -క్రిస్మస్ ఈవ్ ఇన్ మిల్లర్స్ పాయింట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా మూవీ) -అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
జనవరి 3 - విక్‌డ్ ఇంగ్లీష్ (మ్యూజికల్ ఫాంటసీ మూవీ) -అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
జనవరి 3 - బిగ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
జనవరి 3 - డేంజరస్ వాటర్స్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
జనవరి 3 - టైగర్స్ ట్రిగ్గర్ (చైనీస్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ 
జనవరి 3 -సెల్లింగ్ ది సిటీ (ఇంగ్లీష్ రియాలిటీ వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్
జనవరి 3 - ఆరగన్ (తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం) (ఆహా తమిళ్)
జనవరి 3 - ది మ్యాన్ ఆన్ ది రోడ్ - ఇటాలియన్ థ్రిల్లర్ మూవీ (తెలుగు డబ్బింగ్) vrotty ఓటీటీ
జనవరి 3 - కడకన్ మూవీ - సన్ నెక్స్ట్ 


Read Also : Daaku Maharaaj: బాలయ్యో... ఆ దంచుడేందయ్యో... ఊర్వశితో దబిడి దిబిడే... ఇక హిస్టరీ రిపీటే