రోనా తర్వాత ఓటీటీల ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఓటీటీలలో వినోదాన్ని వెతుక్కుంటున్నారు. అందుకే మేకర్స్ కూడా ఓటీటీలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా ప్రతిష్టాత్మకంగా రూపొందింస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఈ వెబ్ సిరీస్ లను ఆదరిస్తుంటారు. కొన్ని వెబ్ సిరీస్ లు సినిమాల కంటే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. తమ వద్ద ఉన్న కంటెంట్ ను సీరీస్ ల రూపంలో దీసుకొచ్చి అందర్నీ ఆకట్టుకుంటున్నారు మేకర్స్. ఈ మధ్య కాలంలో చాలా వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే సినిమా, వెబ్ సిరీస్ లకు రేటింగ్ లు ఇచ్చే వేదిక ‘ఐఎండీబీ’. వీళ్ల రేటింగ్ ను కచ్చితమైన రేటింగ్ గా భావిస్తుంటారు ప్రేక్షకులు. అలాంటి సంస్థ ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ఆదరణ పొందిన 50 వెబ్ సిరీస్ ల లిస్ట్ ను విడుదల చేసింది.

ఇందులో అత్యధికంగా 14 సిరీస్ లు రేటింగ్ ను దక్కించుకోగా మొదటి స్థానంలో నెట్ ప్లెక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న 'సేక్రెడ్ గేమ్స్' నిలిచింది. ఇక రెండో స్థానంలో మీర్జాపూర్(అమెజాన్ ప్రైమ్) మూడో స్థానంలో స్కామ్ 1992 సోనీలివ్), ఫ్యామిలీ మ్యాన్, యాస్పిరెంట్స్ నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. దగ్గుబాటి వెంకటేష్, రానా కలిసి నటించిన తెలుగు - హిందీ వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’ 42వ స్థానంలో నిలిచింది. అంటే, ఈ సీరిస్.. ప్రేక్షకాధరణ పొందడంలో చాలా వెనుకబడిందనే అనుకోవాలి. అలాగే ఐఎండీబీ టాప్ 50 రేటింగ్ ఇచ్చిన మిగిలిన సిరీస్ లను కూడా ఓ లుక్ వేసేయండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

2. మీర్జాపూర్

4. ది ఫ్యామిలీ మ్యాన్

1. బ్రెత్

9. పంచాయత్

10. పాతాళ్ లోక్

15. ఫ్లేమ్స్

17. ఫర్జీ

19. ఇన్సైడ్ ఎడ్జ్

31. హాస్టల్ డేజ్

33. బందీష్ బందిట్స్

34. మేడ్ ఇన్ హెవెన్

35. ఇమ్మెచ్యూర్

47. ముంబయి డైరీస్26/11

48. చాచా విధాయక్ హై హమారా

నెట్ ఫ్లిక్స్

1. సేక్రెడ్ గేమ్స్

8. కోటా ఫ్యాక్టరీ

25. దిల్లీ క్రైమ్

28. లిటిల్ థగ్స్

42. రానా నాయుడు

43. రే

50. అర్నాయక్

సోనీ లివ్

3. స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ

13. కాలేజ్ రొమాన్స్

20. ఉందేవి

22. గుల్లక్

24. రాకెట్బాయ్స్

41. జేఎల్50

46. మహారాణి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

6. క్రిమినల్ జస్టిస్

11. స్పెషల్ ఓపీఎస్

21. ఆర్య

29. తాజా ఖబర్

37. ది నైట్ మేనేజర్

40. దహన్: రాకన్ కా రహస్య

జీ5

23. టీవీఎఫ్ పిచ్చర్స్

30. అభయ్

32. రంగ్బాజ్

39. బిచ్చో కా ఖేల్

44. సన్ ఫ్లవర్

జియో సినిమా

12. అసుర్: వెల్కమ్ టు యుర్ డార్క్ సైడ్

14. అపహరన్

38. క్యాండీ

ఎంఎక్స్ ప్లేయర్

18. ఆశ్రమ్

26. క్యాంపస్ డైరీస్

27. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్

ఇతర సిరీస్లు

5. యాస్పిరెంట్స్ (య్యూట్యూబ్)

16. దిందారో (యూట్యూబ్)

45. ఎన్సీఆర్ డేస్(యూట్యూబ్)

49. ఎహ్ మేరీ ఫ్యామిలీ (అమెజాన్ మినిటీవీ)

Read Also: శకుని మామా ఇకలేరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్తమించిన గుఫీ పెయింటల్! 

Read Also: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!