భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగి సీరియల్ ‘మహాభారత్’. బీఆర్ చోప్రా భారతీయ ఇతిహాసం ‘మహాభారతం’ ఆధారంగా దీనికి రూపకల్పన చేశారు. ఆయనతో పాటు ఆయన తనయుడు రవి చోప్రా దర్శకత్వం వహించారు. ఏండ్లు గడుస్తున్న ఈ సీరియల్ లోని పాత్రలను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.  ఆ సీరియల్ లో కుళ్లుకుతంత్రాలో నిండి ఉన్న శకుని మామ క్యారెక్టర్ లో నటించి, మెప్పించిన ఇకలేరు. గత కొంతకాలంగా వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇవాళ (జూన్ 5) ఉదయం 9 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు.


గుఫీ పెయింటల్  మృతిని ధృవీకరించిన కొడుకు


గుఫీ పెయింటల్  మృతిని అతడి కుమారుడు హ్యారీ పెయింటల్  ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. “బాధాతప్త హృదయంతో మా తండ్రి మిస్టర్ గుఫీ పెంటల్ (శకుని మామా) మరణాన్ని ధృవీకరిస్తున్నాము.  కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆయన ఈ ఉదయం ప్రశాంతంగా కన్నుమూశారు” అని వెల్లడించారు.


కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గుఫీ పెయింటల్  


కొంత కాలంగా గుఫీ పెయింటల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మే 31న ఆయన ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు చికిత్స కొనసాగించారు.  సబర్బన్ అంధేరిలోని ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఆయనకు చికిత్స జరిగింది. అయితే, ఈ మధ్యే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుఫీ మేనల్లుడు హిటెన్ పెయింటల్ తెలిపారు.  ఇంతలోనే ఆయన మరణించడంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  


‘మహాభారత్’తో అద్భుత గుర్తింపు


గుఫీ కేవలం నటుడిగానే కాకుండా 'మహా భారత్' షోకి అసిస్టెంట్ డైరెక్టర్‌, ప్రొడక్షన్ డిజైనర్‌, కాస్టింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 'మహాభారతం' టెలివిజన్ సిరీస్ లో మొత్తం 94 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అక్టోబర్ 2, 1988 నుండి జూన్ 24, 1990 వరకు దూరదర్శన్‌లో ప్రసారం చేశారు. దీనికి రాజ్ కమల్ సంగీతం సమకూర్చారు. వ్యాసుడు రచించిన ఇతిహాసం ఆధారంగా పండిట్ నరేంద్ర శర్మ, హిందీ/ఉర్దూ కవి రాహి మసూమ్ రజా దీనికి స్క్రిప్ట్ రాశారు. ఈ సీరియల్ ద్వారా గుఫీ మంచి పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు అయన 'రఫూ చక్కర్', 'దేస్ పర్దేస్', 'దిల్లగి', 'మైదాన్ ఈ జంగ్', 'దావా' వంటి రచనలతో ప్రసిద్ధికెక్కారు. 'శర్మాజీ నమ్‌కీన్', 'సుహాగ్ వంటి హిందీ చిత్రాలలోనూ నటించారు. టెలివిజన్ షోలు CID, హలో ఇన్‌స్పెక్టర్‌లలోనూ ఆయన నటనకు మంచి గుర్తింపు దక్కింది.






Read Also: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!