Ooru Peru Bhairavakona Top  Trending In OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది.  ట్రైలర్‌, ఫస్ట్‌ పోస్టర్‌తో ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదల అయ్యింది. తొలి షో నుంచి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. థియేటర్ రన్ లో కేవలం రూ. 27 కోట్లు వసూళు చేసింది.  


ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో 'ఊరు పేరు భైరవకోన'


ఈ సినిమా నెల రోజులు కాకముందే  ఓటీటీకి అడుగు పెట్టింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కు వచ్చింది. థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. డిజిటల్ వేదికపై ఊహించని వ్యూస్ అందుకుంటోంది. ఓటీటీలోకి అడుగు పెట్టిన ఒక్కరోజులోనే నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. తెలుగులో మాత్రమే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయినప్పటికీ గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా టాప్ ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‍గా నటించింది. కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మించారు. 






‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కథ ఏంటంటే?


‘ఊరు పేరు భైరవకోన’ సినిమా ఆత్మలు నివసించే ఓ గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రామంలో రాత్రి పూట ప్రతీకారంతో ఊగిపోయే ఆత్మలు నివాసం ఉంటాయి. వాళ్లంతా సాధారణ జనాల మాదిరిగానే కనిపిస్తాయి. తెల్లవారితే ఆత్మలు అన్నీ మాయం అయిపోతాయి. పాత ఊరిలా దర్శనం ఇస్తుంది. సినిమాల్లో డూప్‍గా పని చేసే బసవ లింగం (సందీప్ కిషన్)  ఓ పెళ్లి ఇంట్లో నగలను దొంగతనం చేశాడు. వాటిని తీసుకుని పారిపోతాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో కార్తీకమాసంలో రాత్రివేళల్లోనే తలుపులు తెరుచుకునే  ‘భైరవకోన’లోకి అడుగు పెడతాడు. బసవ లింగంతో పాటు జాన్ (హర్ష చెముడు), గీత (కావ్య థాపర్) వెళ్తారు. ‘భైరవకోన’లో ఏదో మాయ జరుగుతున్నట్లు గుర్తిస్తారు.  అసలు బసవ లింగం నగలను ఎందుకు దొంగతనం చేస్తాడు? అతడికి గీత(వర్ష బొల్లమ్మ)కు సంబంధం ఏంటి?  ఆ మాయా గ్రామంలోకి అడుగు పెట్టిన ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు? అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి. భయపెడుతూనే అలరిస్తాయి. 


Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘గామి’ దూకుడు, రెండో రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?