ఎవరి పేరు ప్రస్తావించకుండా ట్వీట్స్ చేయడం నటి పూనమ్ కౌర్ స్టయిల్. అయితే, ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో అందరికీ తెలిసేలా ఉంటుంది. ఈ రోజు కూడా ఆమె అదే విధంగా ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాను, అందులో హీరోను ఉద్దేశిస్తూ ఆమె ట్వీట్ చేశారనేది ట్విట్టర్ జనాలు అభిప్రాయ పడుతున్నారు.


మ్యాడీ అనే వ్యక్తితో జరిపిన వాట్సాప్ సంభాషణను పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. అందులో 'అక్కా, బావ సినిమాకు వెళ్లాను' అని మరో వ్యక్తి మెసేజ్ చేయడం... సినిమా ఎలా ఉందో నిజాయతీగా చెప్పమని పూనమ్ అడగటం... సినిమా హిట్ అక్కా అని అతను రిప్లై ఇవ్వడం ఉంది. ఈ వాట్సాప్ లీక్ ట్వీట్ చేసిన పూనమ్ కౌర్, లివ్ సింబల్ ఎమోజీ జోడించడం గమనార్హం.






పూనమ్ ట్వీట్ పట్ల నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. సమయం, సందర్భం లేకుండా ట్వీట్ చేయడం ఏమిటని ప్రశ్నించిన ఒకరు డిలీట్ చేయమని చెప్పారు. ఆమెను వైసీపీ పెయిడ్ ఆర్టిస్టుగా మరికొందరు అభివర్ణించారు. ట్రోల్ చేస్తుందో, సపోర్ట్ చేస్తుందో తెలియడం లేదని ఒకరు రిప్లై ఇచ్చారు. ఇంకొంత మంది పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేశారు. 


Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?


Also Read: 'ఫ్యామిలీ మాన్ 2'లో సమంత చేసినట్టు పూనమ్ కౌర్ చేసిందా?