Bigg Boss Telugu OTT - 'నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్' అంటూ ఇటీవల బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసి అంచనాలను పెంచేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి బిగ్ బాస్ రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది. ఓటీటీ వెర్షన్ కి కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరించనున్నారు.
రేపు కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి పంపించనున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో మొదలుకానుంది. ఈసారి కొత్తవాళ్లతో పాటు గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు కొందరు పాపులర్ కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ ఓటీటీతో మళ్లీ బుల్లితెరపైకి తీసుకొస్తున్నారు. ఒకసారి కంటెస్టెంట్స్ లిస్ట్ చూద్దాం!
1. కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1)
2. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
3. ఆదర్శ్ (సీజన్ 1 రన్నరప్)
4. తనీష్ (సీజన్ 2)
5. తేజస్వి (సీజన్ 2)
6. అషు రెడ్డి (సీజన్ 3)
7. అరియానా గ్లోరి (సీజన్ 4)
8. మహేష్ విట్టా (సీజన్ 4)
9. సరయు (సీజన్ 5)10. హమీదా (సీజన్ 5)
11. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
12. యూట్యూబర్, యాంకర్ నిఖిల్
13. యాంకర్ స్రవంతి చొక్కారపు
14. ఆర్జే చైతు
15. యాంకర్ శివ
16. బమ్ చిక్ బబ్లూ
17. కప్పు ముఖ్యం బిగులూ వెంకట్ (సన్నీ ఫ్రెండ్)
వీరందరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా బిగ్ బాస్ ఓటీటీలో కనిపించే అవకాశం ఉంది. వీరితో పాటు టాలీవుడ్ బ్యూటీ బిందు మాధవి కూడా కనిపించబోతుంది. మరికొందరు ఓల్డ్ కంటెస్టెంట్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ షో మొత్తం 84 రోజుల పాటు సాగనుంది. షోపై మంచి క్రియేట్ అయితే గనుక మరిన్ని రోజులు పెంచే ప్లాన్ లో ఉన్నారు నిర్వాహకులు. ఇక రేపటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరి డాన్స్ పెర్ఫార్మన్స్ లు ఉండబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా బయటకొచ్చింది.