ఈ నెల 26వ తేదీ నుంచి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రసారం కానుంది. నాగార్జున హోస్ట్ చేస్తోన్న ఈ షో హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా ప్రసారం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. గత సీజన్లలో కనిపించిన పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్తవాళ్లను కూడా తీసుకోబోతున్నారు. సింగర్ గీతామాధురిని కంటెస్టెంట్ గా తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం భావించింది. కానీ ఆమె ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది చెప్పింది. 

 

బిగ్ బాస్ సీజన్ 2లో రన్నరప్ గా నిలిచిన గీతామాధురికి బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనమని కాల్ వచ్చిందట. తనకు షో అంటే ఇష్టమే అయినప్పటికీ.. బిజీ షెడ్యూల్స్ కారణంగా వెళ్లలేకపోయానని చెప్పింది. కెరీర్ తో పాటు ఫ్యామిలీని కూడా చూసుకోవాలని.. పైగా చిన్న పాప ఉందని.. అందుకే బిగ్ బాస్ ఆఫర్ ని వదులుకున్నానని చెప్పింది. 

 

ఈ క్రమంలో బిగ్ బాస్ ఓటీటీ గురించి మరిన్ని విషయాలు చెప్పింది. సీజన్ 2లో పాల్గొన్నప్పుడు రన్నరప్ గా నిలిచానని.. రెండోసారి వెళ్తే కప్పు వచ్చేస్తుందని అనుకోలేమని.. నేను సెకండ్ హ్యాండ్ అయిపోయా అంటూ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోకి సెకండ్ టైం వెళ్తే సెకండ్ హ్యాండ్, థర్డ్ టైం వెళ్తే థర్డ్ హ్యాండ్ అని.. కానీ ఎప్పుడైనా ఫ్రెష్ టాలెంట్ మాత్రమే కప్పు గెలుస్తుందని చెప్పుకొచ్చింది. 

 

ఇప్పుడు అందరూ సెకండ్ హ్యాండ్ వాళ్లే ఉంటే కాంపిటిషన్ ఉండదేమో కానీ.. కొత్తవాళ్లను మిక్స్ చేస్తున్నారు కాబట్టి.. పాతవాళ్లను గెలిపిస్తే.. కొత్తవాళ్లకు అన్యాయం చేసినట్లు అవుతుందని తన అభిప్రాయాన్ని చెప్పింది. అంతేకాదు.. మాజీ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ షోకి వెళ్లేవాళ్లకు ఓ సలహా కూడా ఇచ్చింది. జాగ్రత్తగా మాట్లాడమని.. ఎట్టిపరిస్థితుల్లో నోరు జారకూడదని చెప్పింది. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని.. రియల్ ఎమోషన్స్ తో ఉండాలని చెప్పింది.