బుల్లితెరపై తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగారు ఓంకార్. 'ఆట', 'ఛాలెంజ్' లాంటి షోలు ఓంకార్ క్రేజ్ ను పెంచాయి. ఈ మధ్యకాలంలో 'సిక్స్త్ సెన్స్', 'ఇస్మార్ట్ జోడీ' వంటి షోలను హోస్ట్ చేశారు. అలానే ప్రముఖ ఛానెల్ లో 'కామెడీ స్టార్స్' అనే షోని రన్ చేశారు. అయితే ఇప్పుడు సడెన్ గా 'ఇస్మార్ట్ జోడి', 'కామెడీ స్టార్స్' షోలను ఆపేశారు. ఓంకార్ ప్లాన్ చేసినట్లుగా ఈ షోలకు రేటింగ్స్ రాకపోవడంతో నిర్వాహకులు ఈ షోలను ఆపేయాలని నిర్ణయించుకున్నారు. 


ఈ విషయంలో సదరు ఛానెల్ తో ఓంకార్ కి విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఓంకార్ సదరు ప్రెస్టీజియస్ ఛానెల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా జెమినీ టీవీతో డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. 'డాన్స్ ఐకాన్' అనే షోని మొదలుపెట్టారు. ఈ షోను శాటిలైట్ కి సంబంధించి జెమినీ టీవీలో, 'ఆహా' ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం 'ఆహా'తో డాన్స్ ఐకాన్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. 


నిజానికి ఈపాటికే షో ప్రసారం కావాల్సింది కానీ ఆడిషన్స్ ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఈ డాన్స్ ఐకాన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనున్నారు ఓంకార్.  ఈ షో గురించి గతంలో ఓంకార్ మాట్లాడుతూ.. 'ఈ షో ద్వారా నేను ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డాన్స్ షోస్ చేశాను.. కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ కి సంబంధించిన కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది. అది ఎవరు అని మేము ఫినాలేలో చెబుతాం. అందుకే ఈ షో మీ కోసమే. మీరో డాన్స్ చేయగలరు అనుకుంటే తప్పకుండా ఈ షో పార్టిసిపేట్ చేయండి అని కోరుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు.


Also Read: మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్ - నో సెంటిమెంట్, ఓన్లీ యాక్షన్!


Also Read: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!