దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాను పడి పడి చూశారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోకి డబ్ చేసి అక్కడ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ 21న ఈ సినిమాను జపాన్ లో విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాను జపాన్ లో ప్రమోట్ చేయడానికి 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఇప్పటికే జపాన్ చేరుకుంది. రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో వెళ్లగా.. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు కొడుకులను తీసుకొని జపాన్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే ఎన్టీఆర్.. జపాన్ మీడియాతో వీడియో కాల్ లో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పుడు నేరుగా జపాన్ మీడియాతో ముచ్చటించనున్నారు. అలానే అక్కడి ప్రేక్షకులతో కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమా చూడనున్నారు.
Also Read : వసూళ్ల వేటలో 'కాంతార' దూకుడు - మూడో రోజూ రఫ్ఫాడించిన రిషబ్ శెట్టి
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ(Koratala Siva), ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను మొదలుపెట్టాల్సివుంది. కానీ ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన లుక్ ని మార్చుకున్నారు.
చాలా వరకు బరువు తగ్గారు ఎన్టీఆర్. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ కుమార్ గైడన్స్ లో ట్రైనింగ్ తీసుకొని ఫిట్ గా తయారయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బరువు 75 కేజీలు. ఇప్పుడు ఆయన కొరటాల శివ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి కొరటాల స్క్రిప్ట్ లాక్ చేస్తే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NTR30 to launch in November: ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే.. నవంబర్ రెండో వారంలో సినిమాను ఫార్మల్ గా లాంచ్ చేసి.. డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట. రాబోయే రోజుల్లో దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య'తో డిజాస్టర్ అందుకున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కారణంగానే సినిమా ఆలస్యమవుతోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు. స్టార్ హీరోయిన్లతో పాటు మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లను కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..!