యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న యాక్షన్ ఎంటర్‏టైనర్ 'సలార్'(Salaar). ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 


 Akhanda Shades Confirmed In Prabhas' Salaar: ఈ సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారు. రీసెంట్ గా అతడికి సంబంధించిన లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో 'అఖండ' షేడ్స్ ఉంటాయట. ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో అఘోరా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విలన్స్ ను వెంటాడి మరీ చంపుతుంది అఘోరా క్యారెక్టర్. 


'సలార్' సినిమాలో కూడా ఇలాంటి కొంతమంది భక్తులు కనిపిస్తారట. కాళీ మాతను కొలిచే కొందరు భక్తులు అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి వారితో పోరాటానికి దిగుతాడు సలార్. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయట. కాళీ మాత టెంపుల్ సెట్ ను నిర్మించి అందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ అని చెబుతున్నారు. 


ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 28, 2023లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది.


ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరిన్ని సినిమాలు ఒప్పుకున్నారు. ఇప్పటికే 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు. మరోపక్క నాగ్ అశ్విన్ డైరెక్ట్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.   


'సలార్' సెట్ లో నో ఫోన్ రూల్:


మొదటి నుంచి కూడా 'సలార్' షూటింగ్ స్పాట్ నుంచి ఫొటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సీరియస్ అవుతున్నారట. ఇలా షూటింగ్ సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకొస్తే జనాల్లో ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుందని.. ఫస్ట్ లుక్, టీజర్స్ వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ పడుతుందేమోనని భయపడుతున్నారు. 


జనాల్లో ఎగ్జైట్మెంట్ అలానే ఉంచాలని.. ఇకపై ఫొటోలు, వీడియోలు లీక్ అవ్వకుండా కొన్ని రూల్స్ పెట్టారు ప్రశాంత్ నీల్. షూటింగ్ లో పాల్గొనే ఎవరి దగ్గర కూడా ఫోన్ ఉండడానికి వీల్లేదని చెప్పారట. మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ, వారి అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ అందరూ కూడా రూమ్స్ లో, క్యారవాన్స్ లో మొబైల్ ఫోన్స్ ను పెట్టిన తరువాత షూటింగ్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారట. ఇదివరకు రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 


Also Read : వసూళ్ల వేటలో 'కాంతార' దూకుడు - మూడో రోజూ రఫ్ఫాడించిన రిషబ్ శెట్టి