Devara 5th Day Box Office Collections: బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ కలెక్షన్లలో దూసుకుపోతుంది. మిక్స్‌డ్ టాక్‌తో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఐదో రోజు అయిన మంగళవారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.5.55 కోట్లు (జీఎస్టీ కాకుండా) వసూలు చేసింది. జీఎస్టీ కలుపుకుంటే ఈ వసూళ్లు రూ.6.07 కోట్లుగా ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.98.64 కోట్ల షేర్‌ను (జీఎస్టీ కాకుండా) ‘దేవర’ వసూలు చేసింది. జీఎస్టీ కూడా కలుపుకుంటే నాలుగో రోజు వసూళ్లతోనే తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఏరియాల వారీగా ‘దేవర’ ఐదో రోజు వసూళ్లు ఇవే.


దేవర ఐదో రోజు వసూళ్లు (జీఎస్టీ కాకుండా)
నైజాం - రూ. 2.37 కోట్లు
సీడెడ్ - రూ. 1.22 కోట్లు
వైజాగ్ - రూ. 0.58 కోట్లు
తూర్పు - రూ. 0.29 కోట్లు
వెస్ట్ - రూ. 0.24 కోట్లు
కృష్ణ - రూ. 0.30 కోట్లు
గుంటూరు - రూ. 0.29 కోట్లు
నెల్లూరు - రూ. 0.26 కోట్లు


ఐదో రోజు మొత్తం వసూళ్లు - రూ. 5.55 కోట్లు


Read Also: అవమానంగా భావించింది అందుకే - లడ్డూ వ్యవహారంపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్


మొత్తం ఐదు రోజుల వసూళ్లు (జీఎస్టీ కాకుండా)
నైజాం - రూ. 37.75 కోట్లు
సీడెడ్- రూ. 20.63 కోట్లు
వైజాగ్ - రూ. 10.21 కోట్లు
తూర్పు- రూ. 6.46 కోట్లు
వెస్ట్ - రూ. 5.15 కోట్లు
కృష్ణ- రూ. 5.79 కోట్లు
గుంటూరు - రూ. 8.73 కోట్లు
నెల్లూరు - రూ. 3.92 కోట్లు


మొత్తం ఐదు రోజుల కలెక్షన్ - రూ. 98.64 కోట్లు


విడుదల అయిన మొదటి రోజు నుంచి ‘దేవర’ వసూళ్లలో దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఏకంగా రూ.172 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మొదటి మూడో రోజుల్లోనే రూ.304 కోట్లు వసూళ్లు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవర్సీస్‌లో కూడా ఐదు మిలియన్ డాలర్ల మార్కును దాటి ఆరు మిలియన్ల వైపు దూసుకుపోతుంది. ఫుల్ రన్‌లో 6.5 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు (అక్టోబర్ 2వ తేదీ) నేషనల్ హాలిడే కాబట్టి ఈరోజు మంచి వసూళ్లు లభించే అవకాశం ఉంది. నేటితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయ్యేందుకు ఛాన్స్‌లు ఉన్నాయి.



Read Also: షాహిద్ కపూర్ 'అశ్వత్థామ'లో జర్మనీ భామ - ఎవరీ ఆర్య? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?