న కన్న బిడ్డల కోసం ఓ భారతీయ తల్లి చేసిన పోరాటం వెండి తెరపై ఆవిష్కృతం అయ్యింది. 'మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే' అనే పేరు​తో తెరకెక్కిన ఈ చిత్రంలో నటి రాణీ ముఖర్జీ నటించింది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ పిల్లల సంరక్షణ కోసం నార్వే ప్రభుత్వంతో పోరాడిన భారతీయ జంట ఆధారంగా రాణి ముఖర్జీ రూపొందించిన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అయితే, భారత్ లోని  నార్వేజియన్ రాయబారి ఈ సినిమాపై స్పందించారు. ఈ చిత్రాన్ని ‘కల్పిత కథ’గా అభివర్ణించారు. ఇందులో చాలా వరకు అవాస్తవాలున్నాయని అభిప్రాయపడ్డారు.   


సినిమాను తప్పుబట్టిన నార్వే రాయబారి


"సాంస్కృతిక భేదాల ఆధారంగా పిల్లలను వారి కుటుంబాల నుండి ఎప్పటికీ వేరు చేయలేరు. చేతులతో తినిపించడం, పిల్లలను వారి తల్లిదండ్రులతో మంచం మీద పడుకోవడం పిల్లలకు హానికరమైన పద్ధతులుగా పరిణించబడుతుంది. నార్వేలో ఇది అసాధారణం కాదు. కొన్ని వాస్తవాలను సరిగ్గా సెట్ చేయాలి. పిల్లలను ప్రత్యమ్నాయ సంరక్షణలో ఉంచడానికి కారణం, వారు నిర్లక్ష్యంగా ఉండటం లేదంటే హింస లాంటి కార్యకలాపాలకు పాల్పడితేనే జరుగుతుంది"అని భారత్ లోనార్వే రాయబారి హన్స్ జాకబ్ ఫ్రైడెన్‌లండ్ తెలిపారు.  


నార్వే ప్రజాస్వామ్య, బహుళ సాంస్కృతిక సమాజమని హన్స్ నొక్కి చెప్పారు. "నార్వేలో, మేము వివిధ కుటుంబ వ్యవస్థలు, సాంస్కృతిక పద్ధతులకు విలువనిస్తాం. గౌరవిస్తాం. ఇవి మనకు అలవాటైన వాటికి భిన్నంగా ఉన్నప్పుడు - పెంపకంలో శారీరక దండనతో పాటు హింసను ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు. ప్రత్యామ్నాయ సంరక్షణ అనేది బాధ్యతతో కూడుకున్నది. డబ్బు సంపాదించే సంస్థ కాదు" అని వెల్లడించారు.


“సాగరిక ఛటర్జీ పిల్లలను తీసుకెళ్తుండగా, ఆమె తన చేతులతో పిల్లలకు ఆహారం పెట్టిందని నార్వే ప్రభుత్వం ఆరోపించింది. ఆ దంపతులు తమ పిల్లలను కొట్టారని, ఆడుకోవడానికి తగినంత స్థలం ఇవ్వలేదని పేర్కొంది. వారికి అవసరమైన బట్టలు, బొమ్మలు ఇవ్వలేని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తర్వాత, నార్వే అధికారులు పిల్లల సంరక్షణను వారి మామయ్యకు అప్పగించింది. వారిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి వీలు కల్పించారు. తమ ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం నార్వే ప్రభుత్వంతో ఎన్నారై దంపతులు జరిపిన పోరాటం నేపథ్యంగా ‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీని ఆషిమా చిబ్బర్ తెరకెక్కించారు. రాణీ ముఖర్జీ, అనిర్బన్ భట్టాచార్య, జిమ్ సర్బా, నీనా గుప్తాల కీలక పాత్ర పోషించారు. 


అసలు ఏం జరిగిందంటే?   


2011లో నార్వేలో అనురూప్, సాగరిక భట్టాచార్య ఇద్దరు పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్ తమ ఆధీనంలోకి తీసుకొని ఓ ఫాస్టర్ సంరక్షణకు అప్పగించింది. పిల్లలకు  సరైన బెడ్ రూమ్ లేదు. వారికి తగిన దుస్తులు, భోజన సదుపాయాలు లేవనే కారణంగా ఇద్దరు పిల్లల్ని నార్వే ప్రభుత్వం తీసుకెళ్లింది. అయితే తమ పిల్లలను తమకు అప్పగించాలని సాగరిక దంపతులు ఎంతో పోరాటం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సంచలనం అయిన ఈ కేసులో భారత్, నార్వే దేశాల దౌత్య అధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దారు.  అనంతరం సాగరిక దగ్గరికి ఇద్దరు పిల్లల్ని చేర్చారు.






Read Also: నిన్న ‘దృశ్యం’, నేడు ‘అయోతి’, వరుసబెట్టి రీమేక్ సినిమాలు చేస్తున్న వెంకటేష్, అజయ్ దేవగన్