The Kerala Story: నటి ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. ఈ మూవీను సుదీప్తో సేన్ తెరకెక్కించారు. కేరళలో కొన్నళ్లుగా వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారన్న వార్తలపై వస్తోన్న ఆరోపణల ఆధారంగా ఈ మూవీను రూపొందించారు దర్శకుడు. ఈ సినిమాపై చాలా చోట్ల వ్యతిరేకత కూడా వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ మూవీను బ్యాన్ చేశారు కూడా. కొన్ని చోట్ల నిరసనలు చేశారు. అయినప్పటికీ ఈ సినిమా వసూళ్ల విషయంలో ఎక్కడా తగ్గలేదు. రికార్డు స్థాయి వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ మూవీ వచ్చి చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సినిమా ఓటీటీలోకి రాలేదు. దీనిపై సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 


ఇది కక్ష సాధింపు చర్యే: సుదీప్తో సేన్


‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇలాంటి హిట్ మూవీ రిలీజ్ అయి ఇన్ని రోజుల గడుస్తున్నా సినిమా ఇప్పటికీ ఓటీటీలోకి రాకపోవడం పట్ల సినీ వర్గాల్లో రకరకాల టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ మూవీ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు దక్కిన విజయాన్ని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, అందుకే తమపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తమ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఏ  ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి కూడా సరైన ఆఫర్ రాలేదని చెప్పారు. ఏదైనా మంచి ఆఫర్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నామని, ఇప్పటి వరకూ ఎవరూ అప్రోచ్ అవ్వలేదని పేర్కొన్నారు. తమపై కొంతమంది కక్ష సాధించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ ఒక గ్యాంగ్ లాగా ఏర్పడినట్లు ఉందన్నారు. తమ విజయం ఇండస్ట్రీలో కొంతమందికి మింగుడుపడటం లేదని, అందుకే ఇలా కక్ష సాధిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం  దర్శకుడు సుదీప్తో సేన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. 


అసలు సినిమాలో ఏముందంటే?


నటి ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఈ ‘ది కేరళ స్టోరీ’. గతకొంత కాలంగా కేరళలో మహిళలు అదృశ్యమవుతున్నారు అని వస్తోన్న వార్తలపై వస్తోన్న ఆరోపణలను ఆధారాంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. కొంత మంది అమ్మాయిలు ఉగ్రవాదల ట్రాప్ లో పడి తర్వాత మతం మార్చుకొని వాళ్లు ఉగ్రవాదులుగా ఎలా ప్రేరేపించబడుతున్నారు అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేశారు. అలా వెళ్లిన ఓ అమ్మాయి తర్వాత మనసు మార్చుకొని ఎలా బయటకు వచ్చింది, అక్కడ ఎలాంటి చిత్రహింసలకు గురైంది అనేదే సినిమా కథ. ఈ మూవీపై అనేక విమర్శలు వచ్చాయి. చాలా చోట్ల నిరసనలు కూడా జరిగాయి. ఈ సినిమా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు కూడా. అయితే కలెక్షన్ల పరంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. సుమారు రూ.300 కోట్ల వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాను విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. మరి ఈ వివాదాల నేపథ్యంలో ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. 


Also Read: ‘సలార్’ విలన్‌కు గాయాలు, చిక్కుల్లో ‘లియో’ హీరో విజయ్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!