మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాలు చేశారు. అందులో చాలా వరకు హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు రీఎంట్రీలో కూడా వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు ఈ సీనియర్ హీరో. ప్రస్తుతం ఈయన 'గాడ్ ఫాదర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. 


ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. అలానే చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి కారులో నుంచి దిగే సీన్ ఓ రేంజ్ లో ఉంది. అయితే ఈ వీడియోలో చిరంజీవి పేరులో ఎక్స్ట్రా గా ఓ లెటర్ వచ్చి చేరింది. సాధారణంగా మెగాస్టార్ పేరును 'CHIRANJEEVI' అని రాస్తారు. 'గాడ్ ఫాదర్' టీజర్‌లో మాత్రం 'CHIRANJEEEVI' అని ఉంది. ఒక 'E' ఎక్స్ట్రా యాడ్ అయింది. 


దీంతో చిరంజీవి న్యూమరాలజీ ప్రకారం తన పేరులో ఒక అక్షరాన్ని జత చేశారంటూ మాటలు వినిపించాయి. కానీ అభిమానులు మాత్రం ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో పేరు మార్చుకోని చిరు ఇప్పుడు ఎందుకు మార్చుకొని ఉంటారని సోషల్ మీడియా వేదికగా సందేహాలు వ్యక్తం చేశారు. బహుశా ఇది 'గాడ్ ఫాదర్' టీమ్ తప్పిదమై ఉంటుందని అనుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. చిరంజీవి ఎలాంటి న్యూమరాలజీను ఫాలో అవ్వడం లేదని.. పొరపాటున స్పెల్లింగ్ తప్పు పడిందని టాక్. 


ఇప్పుడు 'గాడ్ ఫాదర్' టీమ్ ఈ తప్పుని కరెక్ట్ చేయనుందని.. త్వరలోనే యూట్యూబ్ వీడియోలో చిరంజీవి పేరు పెర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటివరకు అయితే వీడియోలో ఎలాంటి మార్పు లేదు. మరి చేంజ్ చేస్తారో లేదో చూడాలి! 


Also Read : కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...