యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ సినిమా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'. విమర్శకుల నుంచి సినిమాకు గొప్ప రివ్యూలు రాలేదు. అయితే... మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉన్నట్టు ఉంది. అందువల్ల, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. సుమారు 550 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.


ఫస్ట్ వీకెండ్ రూ. 4.5 కోట్లు కలెక్ట్ చేసిన కిరణ్ అబ్బవరం
రాజా వారు రాణి గారు', 'ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం' సినిమాలు మాస్ ప్రేక్షకుల్లో కిరణ్ అబ్బవరానికి మంచి పేరు తెచ్చాయి. ఆ రెండు సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఆ క్రేజ్ 'సమ్మతమే'కు, ఇప్పుడీ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' (Nenu Meeku Baga Kavalsina Vadini Movie Collections) కు కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా నాలుగున్నర కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని టాక్. ఈ కలెక్షన్స్ చూస్తుంటే... మాస్ ఆడియన్స్ సినిమాకు వస్తున్నట్లు ఉన్నారు. 


నిర్మాతగా కోడి రామకృష్ణ కుమార్తెకు తొలి చిత్రమిది!
శతాధిక చిత్ర దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి (Kodi Divya Deepthi) ఈ సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కోడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ఆమె తొలి ప్రయత్నంగా 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' నిర్మించారు.


స్క్రీన్ ప్లే, మాటలు రాసిన హీరో కిరణ్
'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమాలో హీరోగా నటించడమే కాదు... కిరణ్ అబ్బవరం స్క్రీన్ ప్లే, మాటలు కూడా రాశారు. ఇంతకు ముందు 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' సినిమాతో ఆయన రచయితగా నిరూపించుకున్నారు. మరోసారి ఈ సినిమా కోసం పెన్ పట్టుకున్నారు.


Also Read : అక్టోబర్ నుంచి పవన్ ప్లాన్ ఇదే - నిర్మాతలు ఖుషీ!


'ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం' చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీధర్‌ గాదే, ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతం  అందించగా... భాస్కరభట్ల రవికుమార్, కాసర్ల శ్యామ్ పాటలు రాశారు. మణిశర్మ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో కన్నడ భామ సంజనా ఆనంద్ కథానాయికగా నటించారు. సోనూ ఠాకూర్ కీలక పాత్రలో కనిపించారు. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ హీరోతో పాటు కనిపించే పాత్ర పోషించారు. 


గీతా ఆర్ట్స్, మైతీ మూవీ మేకర్స్ సంస్థల్లో...
Kiran Abbavaram New Movie : ప్రస్తుతం కిరణ్ అబ్బవరం మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో గీతా ఆర్ట్స్ సంస్థలో రూపొందుతోన్న 'వినరో భాగ్యము విష్ణుకథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie) ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'మీటర్' మరొకటి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ పూర్తయింది. ఏయం రత్నం నిర్మాణంలో 'రూల్స్ రంజన్' చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. శ్రీధర్ గాదెతో మరో సినిమా చేసే సన్నాహాల్లో ఉన్నారు. 


Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!