Nithin and Venky Kudumula movie VN2 First Look On Republic Day 2024: హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుములది సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరూ కలిసి చేసిన 'భీష్మ' బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఇప్పుడు వాళ్లిద్దరూ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫస్ట్ లుక్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు ఈ రోజు చిత్ర బృందం వెల్లడించింది.


మోసగాడిగా కనిపించనున్న నితిన్!
'భీష్మ' సినిమాలో నితిన్ మీమర్ రోల్ చేశారు. మీమ్ మేకర్ నుంచి ఆ తర్వాత ఓ కంపెనీకి సిఈవో అవుతారు. కొత్త సినిమా విషయానికి వస్తే... జనాలను బురిడీ కొట్టించే మోసగాడిగా నితిన్ కనిపించనున్నట్లు అర్థం అవుతోంది. ''గిఫ్ట్స్ ఇచ్చే సీజన్ ముగిసింది. త్వరలో దోచుకునే సీజన్ మొదలు అవుతుంది. జనవరి 26న ఉదయం 11.07 గంటలకు మోసగాడి ముఖాన్ని మీకు చూపిస్తాం'' అని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. టైటిల్ కూడా ఆ రోజు విడుదల చేసే అవకాశం ఉంది.


Also Read: నాలుగు వందల కోట్లు... ఐదు సినిమాలు... బెంగళూరులో ఈ రోజు ఓపెనింగ్!






నితిన్ జోడీగా మరోసారి శ్రీ లీల
నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న కొత్త సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్. నితిన్ జోడీగా ఆమె నటిస్తున్న రెండో సినిమా ఇది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో నితిన్, శ్రీ లీల జంటగా నటించిన సంగతి తెలిసిందే.


Also Read: ఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగన లుక్ చూశారా?


నిజం చెప్పాలంటే... నితిన్ జోడీగా ముందు శ్రీ లీలను ఎంపిక చేయలేదు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నాను తీసుకున్నారు. 'భీష్మ'కు ముందు వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమైన 'ఛలో' సినిమాలోనూ రష్మిక హీరోయిన్. స్క్రిప్ట్ రాసే ముందు కథానాయికగా రష్మికా మందన్నా పేరును వెంకీ కుడుముల రాస్తారని ఈ సినిమా కాన్సెప్ట్ ప్రోమోలో నితిన్ సెటైర్ కూడా వేశారు. అయితే... షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆమె తప్పుకొన్నారు. దాంతో శ్రీ లీలను సెలెక్ట్ చేశారు. ప్రజెంట్ కేరళలో షూటింగ్ చేస్తున్నారని టాక్. హీరో హీరోయిన్ల మీద దర్శకుడు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. త్వరలో హైదరాబాద్ తిరిగి వస్తారట.


Also Read: దర్శకుడిగా ధనరాజ్ మొదటి సినిమా ఫస్ట్ లుక్ - ఆయన వెనుక ఉన్న నటుడిని గుర్తు పట్టారా?