Mercury Transit in Capricorn on 1 February 2024: ప్రస్తుతం ధనస్సు రాశిలో ఉన్న గ్రహాల యువరాజైన బుధుడు 2024 ఫిబ్రవరి 01న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 ఉదయం పది గంటల 03 నిముషాలకు మకరంలోకి ప్రవేశించి...ఫిబ్రవరి 18 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు.  బధుడి సంచారం అనుకూల దిశలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి శారీరకంగా బలంగా లేకపోయినా మానసికంగా చాలా బలంగా ఉంటారు. పదునైన తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రత్యర్థులకు చెక్ పెట్టడంలో సిద్ధహస్తులు. బుధుడి సంచారం సరిగా లేకపోతే ఊహించని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మకర రాశిలో బుధుడి సంచారం ఏ రాశులవారికి కలిసొస్తుంది..ఏ రాశివారు ఏ మంత్రం పఠించడం ద్వారా వ్యతిరేక ఫలితాల నుంచి ఉపశమనం లభిస్తుంది...


మేష రాశి
మకర రాశిలోకి బుధుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారికి చాలా ఉపశమనం లభిస్తుంది. గడిచిన నెలలో పడిన బాధల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. ఉద్యోగులు ప్రతిభకు తగిన ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం బావుంటుంది.ప్రేమ బంధంలో ఉన్నవారు పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచి సమయం. 


మిథున రాశి
మిథున రాశివారికి కూడా బుధుడి సంచారం కలిసొస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలు పొందుతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి టైమ్ ఇది.


సింహ రాశి
మకరంలో బుధుడి సంచారం సింహరాశివారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గడిచిన నెలలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే వ్యాపారులు పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతే నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.


తులా రాశి
బుధుడి సంచారం తులారాశివారికి మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. మనసులో ఉన్న చాలా గందరగోళానికి ఫుల్ స్టాప్ పడుతుంది. సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రశాంతంగా ఆలోచిస్తారు. కోపం తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉండేవారిక కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. 


వృశ్చిక రాశి
మకర రాశిలో బుధుడి సంచారం వృశ్చికరాశివారికి మంచి చేస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి 18 వరకూ మీరు ప్రారంభించే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ బంధాల్లో ప్రశాంతత ఉండాలంటే జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. కోపం తగ్గించుకోవాలి. ఉగ్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 


బుధుడి సంచారం కారణంగా వచ్చే వ్యతిరేక ఫలితాల ప్రభావం నుంచి విముక్తి కోసం మీ రాశి ప్రకారం జపించాల్సిన మంత్రం ఇదే...


మేష రాశి  - ప్రతిరోజూ 41 సార్లు అష్టాక్షరి మంత్రం "ఓం నమో నారాయణాయ" జపించండి
వృషభ రాశి - ప్రతిరోజూ 21 సార్లు "ఓం బుధాయ నమః" మంత్రం జపించండి
మిథున రాశి -  నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది
కర్కాటక రాశి - రోజూ 11 సార్లు "ఓం చంద్రాయ నమః" జపించండి 
సింహ రాశి - ప్రతిరోజూ విష్ణుసహస్రనామం జపించండి 
కన్యా రాశి -  బుధవారం యాగం/హవనం నిర్వహిస్తే మంచిది 
వృశ్చిక రాశి - ప్రతిరోజూ 11 సార్లు "ఓం భౌమాయ నమః" అని జపించండి 
ధనుస్సు రాశి - గురువారం రోజు శివునికి యాగం నిర్వహించండి 
మకర రాశి - శనివారం హనుమంతుడికి పూజ లేదా యాగం చేయండి 
కుంభ రాశి - నిత్యం "ఓం వాయుపుత్రాయ నమః" అని జపించాలి 
మీన రాశి - గురువారం బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వండి