2022 కొద్దిరోజుల్లోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రేక్షకాదరణ పొందిన అనేక చిత్రాలు, వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ఈ ఏడాది తమ ఓటీటీ లో ఎక్కువ మంది చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితాలను విడుదల చేసింది. అయితే ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఈ జాబితాలో లేకపోవడం అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఈ జాబితాలో తమిళ నటుడు ధనుష్ నటించిన ‘ది గ్రే మ్యాన్’ సినిమా చోటు దక్కించుకోవడం విశేషం.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. అల్లూరి సీతరామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో చరణ్, ఎన్టీఆర్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రశంసలు అందుకుంది. ఎన్నో ప్రపంచ అవార్డులను గెలుచుకుంటోంది. అయితే నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన తాజా జాబితాలో మాత్రం ‘RRR’కు చోటు దక్కలేదు. రుస్సో బ్రదర్స్ రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది గ్రే మ్యాన్’ సినిమాను ఎక్కువ మంది వీక్షించారు. ఈ మూవీ జులై 17 నుంచి సెప్టెంబర్ 24 మధ్య 265,980,000 గంటలు స్ట్రీమింగ్ అయినట్లు వెల్లడించింది నెట్ ఫ్లిక్స్.
నెట్ ఫ్లిక్స్ లో ప్రజాదరణ పొందిన ఇంగ్లీష్ మూవీస్
- ది గ్రే మ్యాన్
- ది ఆడమ్ ప్రాజెక్టు
- పర్సుల్ హార్ట్స్
- హ సెల్
- ది టిండర్ స్విడ్లర్
- ది సీ బీస్ట్
- అనోలా హోమ్స్ 2
- సీనియర్ ఇయర్
- ది మ్యాన్ ఫ్రమ్ టొరంటో
- డే షిఫ్ట్
అత్యంత ప్రజాదరణ పొందిన నాన్ ఇంగ్లీష్ సినిమాలు
- ట్రోల్
- ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
- బ్లాక్ కర్బ్
- త్రో మై విండో
- ది టేక్ డౌన్
- లవింగ్ అడల్ట్స్
- కార్టర్
- మై నేమ్ ఈజ్ వెంటట్టా
- రెస్ట్ లెస్
- ఫ్యూరోజా
అధిక ప్రజాదరణ పొందిన ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు
- స్ట్రేంజర్ థింగ్స్ (సీజన్-4)
- వెన్స్ డే ( సీజన్-1)
- దహమర్
- బ్రిడ్జర్ టన్ (సీజన్-2)
- ఇన్వెంటింగా అన్నా
- ఓజార్క్ (సీజన్-4)
- ది వాచర్
- ది సాండ్ మ్యాన్
- ది అంబరిల్లా అకాడమీ (సీజన్-3)
- వర్జీన్ రివర్ (సీజన్-4)
Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ ఎలా ఉందంటే?
అత్యధిక ప్రజాదరణ పొందిన నాన్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు
- ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ (సీజన్ 1)
- ఎక్స్ట్రార్డనరీ అటార్నీ వూ (సీజన్ 1)
- ది మార్క్ హార్ట్ (సీజన్ 1)
- టిల్ మనీ డూ అజ్ పార్ట్ (సీజన్ 1)
- ఇలైట్ (సీజన్ 5)
- హై హీట్ (సీజన్ 1)
- ది ఎంప్రస్ (సీజన్ 1)
- బిజినెస్ ప్రపోజల్ (సీజన్ 1)
- రాంగ్ సైడ్ ఆఫ్ ది ట్రాక్స్ (సీజన్ 1)
- వెల్కమ్ టు ఈడెన్ (సీజన్ 1)