'నువ్వు సీతవైతే నేను రాముడిని అంట... నువ్వు రాధావైతే నేను కృష్ణుడిని అంట'' అంటూ ''నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవంటా!'' శ్రుతీ హాసన్‌తో పాటలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్టెప్పులు వేశారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో వాళ్ళిద్దరి మధ్య సాంగ్ అదొక్కటే కాదు, మరొకటి ఉంది. మరికొన్ని గంటల్లో ఆ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.
నీకేమో అందం ఎక్కువ...
నాకేమో తొందర ఎక్కువ!
Waltair Veerayya 5th Single : 'వాల్తేరు వీరయ్య' నుంచి ఇప్పటి వరకు నాలుగు పాటలు విడుదల చేశారు. 'బాస్ పార్టీ...' పాటను అన్నిటి కంటే ముందు విడుదల చేశారు. 40 మిలియన్స్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. చిరంజీవి, రవితేజపై తెరకెక్కించిన 'పూనకాలు లోడింగ్...', 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. 'నువ్వు శ్రీదేవి, చిరంజీవి' సాంగ్ ఒకటి. ఇప్పుడు ఐదో పాట విడుదలకు సమయం ఆసన్నమైంది.
'నీకేమో అందం ఎక్కువ... నాకేమో తొందర ఎక్కువ' అంటూ సాగే పాటను జనవరి 11న... అనగా బుధవారం ఉదయం 10.35 గంటలకు విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. సాంగ్ స్టిల్ కూడా విడుదల చేశారు. అందులో శ్రుతీ హాసన్ మోడ్రన్ లుక్‌లో, చిరంజీవి మాస్ లుక్‌లో కనిపించారు.
Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?
అంచనాలు పెంచిన ట్రైలర్
మెగా అభిమానులు చిరంజీవిని ఏ విధంగా చూడాలని కోరుకుంటారో... ఆ విధంగా తన అభిమాన కథానాయకుడిని ప్రేక్షకులకు చూపించే ఉద్దేశంతో 'వాల్తేరు వీరయ్య'ను దర్శకుడైన మెగాభిమాని బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. వింటేజ్ చిరును గుర్తు చేసేలా ఆయన కామెడీ సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచింది.
'మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టింది ఆయన్ను చూసి...' చిరంజీవి గురించి ఓ క్యారెక్టర్ చెప్పే డైలాగ్, 'రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డులు ఉంటాయి' అని మెగాస్టార్ చెప్పే మాట అభిమానులకు మాంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. చిరంజీవి, రవితేజ మీద కట్ చేసిన కొన్ని షాట్లు బావున్నాయి. ఫుల్ మాస్ మీల్స్ సినిమాలా ఉంది... ట్రైలర్ చూస్తుంటే! థియేటర్లలో సినిమా చూసే అభిమానులకు మెగా మాస్ పూనకాలే!
ట్రైలర్ చివర్లో 'హలో మాష్టారు! ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి' అని రవితేజ వార్నింగ్ ఇవ్వడం... 'ఏంట్రా బద్దలయ్యేది? ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు ఎంతో మంది వస్తారు, పోతారు. కానీ, వీరయ్య లోకల్' అని చిరంజీవి కౌంటర్ ఇవ్వడం హైలైట్. థియేటర్లలో ఈ సన్నివేశాలకు అభిమానులకు మెగా మాస్ పూనకాలే!
అభిమానులను మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఉన్నాయని బాబీ చెప్పారు. లాక్‌డౌన్‌లో వరల్డ్ సినిమా, ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కథ రాయడంతో రవితేజ క్యారెక్టర్ యాడ్ అయ్యిందని చెప్పారు.
Also Read : లోకేష్‌ను కలిసిన నందమూరి తారకరత్న - ఎమ్మెల్యే టికెట్ విషయమై చర్చలు?